చేతులు అందంగా.. మనం స్టైలిష్‌గా కనిపించాలంటే గోళ్లకు నెయిల్ పాలిష్ ఉండాల్సిందే అంటారు అమ్మాయిలు. ఈ క్ర‌మంలోనే ఆడవారు చేతివేళ్లు అందంగా కనిపించాలని పలు రకాల నెయిల్ పాలిష్ ను వాడుతుండడం చూస్తూనే ఉంటాం. ఒక రంగులోనే కాకుండా ఎన్నో రంగులను వీరు ఉపయోగిస్తుంటారు. మ‌రియు రోజుకో రంగు నెయిల్ పాలిష్ వేసుకొని మురిసిపోయే అమ్మాయిలూ ఉంటారు. అలాగే ఏదో వేశామంటే వేసుకున్నామన్నట్టు కాకుండా.. ఈ మధ్య నెయిల్ ఆర్ట్ పేరుతో గోళ్లను చాలా అందంగా మలుస్తున్నారు.

 

అయితే నెయిల్ పాలిష్ కేవ‌లం గోళ్ల‌కే కాదు.. చాలా విధాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చు. స్టోన్ జ్యువెలరీ అంటే అందరు ఇష్టపడతారు. అయితే ఇవి కొన్నప్పుడు బానే ఉంటుంది. కానీ తర్వాత స్టోన్స్ రాలిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో నెయిల్ పాలిష్‌ బాగా పనిచేస్తుంది. ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌ని తీసుకుని రాలిపోయిన స్టోన్స్‌ని తిరిగి అతికించొచ్చు. కొన్ని సందర్భాల్లో తలుపు, ఫర్నీచర్ స్క్రూస్ వదులుగా మారతుంటాయి. వాటిని ఎన్నిసార్లు టైట్ చేసినా పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. 

 

ఇలాంటి సందర్భాల్లో.. వాటిని బిగించే ముందు స్క్రూస్‌కి ముందుగా నెయిల్ పాలిష్‌ని అప్లై చేయండి. ఆరిన తర్వాత వాటిని బిగింస్తే టైట్‌గా ఉంటాయి. అదేవిధంగా, ఆడ‌వాళ్లు ఆర్టిఫిషియల్ జ్యువెలరీని యూజ్ చేస్తారు. ఇక అవి కొన్న కొత్తలో ధగ ధగ మెరుస్తూ అందంగా ఉంటుంది. రాను రాను కలర్ మారి చూడ్డానికి అంతగా బాగోదు. అలాంటి సందర్భాల్లో ట్రాన్స్‌పరెంట్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుండి.. దీనిని ముందుగానే జ్యువెలరీపై పలుచగా కోటింగ్ వేసి ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల రంగు త్వరగా వెలసిపోకుండా మెరిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: