అమ్మాయి క‌ళ్ళు అందంగా క‌నిపించ‌డానికి కాటుక కూడా ఒక కార‌ణం అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ముఖ్యంగా పర్వదినాల్లో సాంప్రదాయ దుస్తుల్లో కాటుక చాలా అందంగా ఉంటుంది. ఎంత చిన్న క‌ళ్ళైనా ర‌వ్వంతా కాటుక అల‌క‌రింస్తే పెద్ద‌గా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. అయితే కాటుక పెట్టుకుంటారు కానీ.. దీని గురించి కొన్ని విష‌యాలు చాలా మందికి అవ‌గాహ‌న ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్త‌వానికి స్త్రీలకు అయిదవ తనాన్ని సూచించే సుమంగళ ద్రవ్యాలలో కాటుక కూడా ఒకటి. 

 

ఇది కళ్ళకు పెట్టుకోవడం ద్వారా కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. అలాగే మహిళలు కాటుక పెట్టుకోవడం వలన కళ్ళకు చల్లగా ఉండ‌డంతో పాటు ప్రకాశవంతంగా ఉంటాయి. కాటుక దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడుతుంది. ఇక మగువలు ఎక్కువగా వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కాటుక కూడా ఒకటి. ఎంత మేకప్ వేసిన అది కళ్ళకు కాటికతోనే పూర్తవుతుంది. కాటుక పెట్టుకుంటే ముఖంలో గ్లో వస్తుంది. సూర్య కిరణాలు నేరుగా కళ్ళలోకి పడితే చాలా ప్రమాదకరం. 

 

అయితే కాటుక పెట్టుకుంటే సూర్య కిరణాలు పడినా కంటికి హాని కలగదు. అదేవిధంగా, ఏవైనా ప్రెజెంటేషన్స్, డెమోలు ఇచ్చే వారికి ఇది ఎంతో బాగా యూజ్ అవుతుంది. కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు విశాలంగా కనిపిస్తాయి. దాని వల్ల మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏకాగ్రతగా వింటారు. ఇక ఎక్కువగా చెమట పట్టే వారు, ఉక్కపోతగా ఉన్నప్పుడు కాటుక పెట్టుకునేవారు ముఖాన్ని ఐస్‌ ముక్కలతో మర్దన చేసుకోవడం వల్ల చెమట పట్టడం తగ్గి తద్వారా పెట్టిన కాటుక చెదరకుండా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: