సాధార‌ణంగా చాలా మంది మ‌హిళ‌లు  అవాంఛిత రోమాల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌హిళ‌ల ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల చాలా బాధపడుతుంటారు. చక్కని ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల ముఖం అందవికారంగా తయారవుతుంది. అయితే అవాంఛిత రోమాలు చిన్నగా ప్రారంభమై కొన్ని సమయాల్లో అకస్మాత్తుగా ఎక్కువుగా వృద్ధి చెందుతాయి. ఈ సమస్య కొన్నిసార్లు వ్యాక్స్‌ చేయించటం, చికిత్సలు తీసుకోవటం వల్లనో తగ్గకపోగా, సమస్య మరింతగా పెరిగే అవకాశముంది. కానీ, ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ఇంట్లోనే నివారించ‌వ‌చ్చ‌ని చాలా మందికి తెలియ‌దు.

 

మ‌రి దాని కోసం ఏం చేయాలి..? వేటిని ఉప‌యోగించాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు ముందుగా.. ఒక బౌల్‌లో ఎగ్ వైట్, మొక్కజొన్న పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై రాసి.. ఆరనివ్వాలి. ఆరిన త‌ర్వాత ఈ ప్యాక్‌ను తొలిగిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే రెండు స్పూన్ల తేనెలో కొద్దిగా నిమ్మరసం వేసి, కాటన్ బాల్స్ తో రోమాలు ఉన్నచోట నిమ్మరసం తేనె మిశ్రమాన్నినేరుగా అప్లై చేయాలి. 

 

ఇది తడి పూర్తిగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే అద్భుత ఫ‌లితం పొందొచ్చు. అదేవిధంగా, తేనె మరియు ఎగ్ వైట్ యొక్క మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత దాన్ని తొలగిస్తే సన్నని హెయిర్ కూడా వచ్చేస్తుంది. మ‌రియు చ‌ర్మంపై హెయిర్‌ను నివారించడానికి మరో ఉత్తమ మార్గం ఆనియన్ ప్యాక్. ఈ ఆనియన్ ప్యాక్ అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. దీనిని తులసి ఆకుల రసంతో కలిపి అప్లై చేస్తే వేగ‌వంత‌మైన ఫ‌లితం పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: