సాధార‌ణంగా జుట్టు కొంచెం పొడవు, ఒత్తుగా ఉంటే ప్రతి ఒక్కరికీ వారికి నచ్చిన హెయిర్‌ స్టైల్‌ ట్రై చేయాలని ఉంటుంది. కానీ అలా చేయడానికి ముందు జుట్టు బలంగా ఉందా? అని చూసుకోవాలి. నేటి కాలంలో చాలామంది జుట్టు రాలుతుందని, చుండ్రు వస్తుందని, జుట్టు పొట్లిపోతుంది ఇలా అనేక కారణాలతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్రమంలోనే వీటిని నివారించుకోవ‌డానికి భారీగా డ‌బ్బులు వెచ్చిస్తున్నారు. కానీ, తెలియ‌ని విష‌యం ఏంటంటే ఈ స‌మ‌స్య‌ల‌కు ఇంట్లోనే చెక్ పెట్ట‌వ‌చ్చు. నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ వాసన నచ్చని వారెవరైనా ఉంటారా.. అంటే ఉండ‌ర‌నే చెప్పాలి. 

 

అలాంటి తాజా నిమ్మకాయలో ఉన్న ఆరోగ్య, సౌంద‌ర్య‌ సుగుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా నిమ్మ‌కాయ శిరోజాల‌ను మెరిపించ‌డంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌రి నిమ్మాక జుట్టుకు ఎలా ఉప‌యోగించాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మరసం మాడుమీద రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గడమే కాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అంతేకాదు జుట్టుకు సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది. 

 

నిమ్మరసాన్ని నేరుగా వెంట్రుకలకు రాసుకుంటే అవి సహజమైన నల్లని రంగుతో బాగా మెరుస్తాయి. అలాగే ఎగ్ వైట్‌లో నిమ్మరసం కలిపి తరువాత మిశ్రమాన్ని జుట్టు రాసుకుని పావు గంట‌ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి ఇలా చేస్తే, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది మరియు బాగా పెరుగుతుంది. మ‌రియు పెరుగులో నిమ్మరసం కలిపి  తలకు ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చండ్రు స‌మ‌స్య త‌గ్గ‌డ‌మే కాకుండా.. జుట్టు బాగా పెరగడానికి స‌హాయ‌ప‌డుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: