మనం గమనించినట్టు అయితే.. మనం ఉపయోగించే క్రిముల కంటే కూడా వంటింట్లో ఉండే దినుసులతో మన ముఖం మెరిసిపోతుంది. అందుకే ఇంట్లో ఉండే దినుసులను సహజసిద్ధంగా ఉపయోగించి మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి.. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎండలో తిరగడం లేదు కానీ లేకపోతే ఓ రేంజ్ లో ఎండలో తిరిగేవాళ్లు.. ఇంకా లాక్ డౌన్ అనంతరం అమ్మాయిలు ఓ రేంజ్ లో ఎండలో తిరుగుతారు.. సరే ఇప్పుడు అయితే ఈ విషయం పక్కన పెట్టి.. నల్లగా మారిపోయిన చర్మానికి రెండు చెంచాల శనగపిండి పెరుగు, నిమ్మరసం, పసుపు కలిపి మిశ్రమంలా తయారు చేసి పట్టించుకుంటే మంచి రంగు తేలుతారు. 

 

ఇంకా కాస్త శనగపిండిలో ఓట్స్‌పొడి, రెండు చెంచాల మొక్కజొన్న పొడి వేసి పచ్చిపాలతో కలిపి ముఖానికి సున్నితంగా రుద్దితే మృతకణాలు జిడ్డు మురికి తొలిగిపోయి ముఖం నిగారింపుతో మెరిసిపోతుంది. 

 

ఈ చిట్కాలు పాటించి మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి.. మంచి రంగుతో మెరిసిపోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: