మనం సరైన ఆహారం తీసుకోకపోయినా.. ఎక్కువ ఒత్తిడికి గురైన.. అలసటకు గురైన కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఇంట్లో దొరికే కొన్ని పదార్ధాలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

గులాబీ రెక్కల్ని నలిపి దాని నుండి వచ్చిన రసాన్ని కళ్ల చుట్టూ మృదువుగా రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంగు మరి వలయాలూ దూరమవుతాయి.

 

స్ట్రాబెర్రీలో విటమిన్‌ సి ఎక్కువ ఉంటుంది. ఈ పండు ఒకటి తీసుకుని మెత్తగా మెదిపి గుజ్జును కేవలం కళ్ల కింద మాత్రమే కాదు.. ముఖమంతా రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెల్లబడి మెరిసిపోతారు. 

 

పుచ్చకాయ.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఎంతమంచిదో.. అందానికి కూడా అంతే మంచిది. ఈ పండు గుజ్జును కాస్త తీసుకుని కళ్ల చుట్టూ.. రెప్పల మీద రాసుకుని మర్దన చేస్తే ముఖం అందంగా తయారవుతుంది. 

 

కీరదోసను చిన్నగా కట్ చేసి ఫ్రిజ్‌లో కాసేపు ఉంచి.. ఆతరవాత కళ్ల మీద పెడితే నల్లటి వలయాలు తగ్గుతాయి.. అలసటా, ఒత్తిడీ దూరం అవుతాయి. ఇంకేందుకు ఆలస్యం.. వెంతంటే ఈ చిట్కాలు పాటించి అందంగా తయారవ్వండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: