య‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అందుకోసం చేసే ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో ఖ‌ర్చు చేసి ఎన్నో టిప్స్‌ను ఫాలో అవుతూ ఉంటారు. కానీ, ప్ర‌యోజ‌నాలు క‌నిపించ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ముఖ్యంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య‌.. త‌క్క‌వ వ‌య‌సు అయినా.. ఎక్కువ వ‌య‌సులా క‌నిపించ‌డం. దీన్ని అమ్మాయిలు చాలా షేమ్‌గా‌ ఫీల్ అవుతారు. అయితే వాస్త‌వానికి మీరు చేసే చిన్ని చిన్న మేక‌ప్ త‌ప్పులే.. మీ వ‌య‌సును ఎక్క‌వ‌గా చేసి చూపిస్తుంది. 

 

మ‌హిళ‌లు సాధారణంగా మేకప్ ద్వారా తమ వయసును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అందులో కనుక పొరపాటు జరిగితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. మ‌రి ఆ త‌ప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. చాలా మంది బ్లష్ ను ఎక్కువ‌గా రాసుకోవడం లేక సరైన ప్రదేశంలో రాసుకోవకపోవటం వలన ఎబ్బెట్టుగా, అసహజంగా కనిపిస్తారు. దాని వలన మరీంత వయస్సు మీద పడినట్లు కనిపిస్తారు. అందుకే బ్లష్ ని మీ చెక్కిళ్ళ పై లైట్‌గా అద్దుకుంటే మీ ముఖానికి కొత్త లుక్ వ‌స్తుతంది. 

 

అలాగే కన్సీలర్ వాడకంలో చాలా మంది త‌ప్పులు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా లేత రంగు కన్సీలర్ ను వాడ‌డం. లేత రంగు కన్సీలర్ ను  హైలైటింగ్ కు వాడతారు. వాస్త‌వానికి లేత రంగు కన్సీలర్లు మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తాయి. మ‌రియు మీ వ‌య‌సుని కూడా ఎక్క‌వ‌గా చూపించేందుకు ప్రేరేపిస్తుంది. అదేవిధంగా, ముదురు రంగులు వాడ‌డం వ‌ల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మీ పెదవులలో ఉండే కొల్లాజన్ తగ్గిపోతుంది. దీంతో పెద‌వులు నిండుద‌న త‌గ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: