ప్రస్తుతం లాక్ డౌన్ కాబట్టి అందరూ ఇళ్లకు పరిమితం అయ్యారు కానీ.. లేదు అంటే దుమ్ము దూళిలో తిరిగేవారు. ఇకపోతే గమినించినట్టు అయితే.. మన ముఖం ఒక రంగులో ఉంటుంది.. మన చేతులు మరో రంగులో ఉంటాయి.. కాళ్ళు మరో రంగులో ఉంటాయి. ఇలా కాకుండా చేతులు కూడా మెరిసిపోవాలి అంటే కొన్ని అద్భుత చిట్కాలు పాటించాలి.. ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

తరచూ చేతుల్ని కడగటం వల్ల చర్మం పాడవుతుంది. అందుకే వీలైనంత వరకూ పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలానే గాఢత ఎక్కువగా ఉన్న రసాయనాలున్న సబ్బులు, షాంపూలను ఉపయోగించడం తగ్గించాలి. 

 

బయటకు వెళ్లి సమయంలో ముఖానికి మాత్రమే కాకుండా చేతులకు, కాళ్లకు కూడా సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి.. అప్పుడే ఎండ ప్రభావం చేతులపై పడదు.. చర్మం కూడా పాడవదు. 

 

స్నానం తరువాత మాయిశ్చరైజర్‌ ఎక్కువగా రాసుకోవడం మంచింది.. కుదిరితే ప్రతి రెండు గంటలకోసారి రాసుకోవాలి. రాత్రి పూట కొబ్బరి, ఆలివ్, బాదం వంటి నూనెలతో చేతులను మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. 

 

చెంచా ఉప్పు, చెంచా చక్కర తీసుకొని అందులో కాస్త తేనే చేర్చు చేతులకు పట్టించుకుంటే మృతకణాలు తొలిగిపోయి చర్మానికి రక్తప్రసరణ బాగా అవుతుంది. 

 

నిమ్మర కాయ రసంలో కాస్త గ్లిజరిన్, ఐదు చుక్కల రోజ్ వాటర్ కలిపి చేతులకు పట్టించి మర్దన చేసుకుంటే చేతులు ఆరోగ్యంగా ఉంటాయి. 

 

కీరదోస గుజ్జులో కొద్దిగా గ్లిజరిన్‌ కలిపి చేతులకు పట్టించుకోని కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముడతలు పడకుండా ఉంటాయి.

 

ఈ చిట్కాలు పాటించడం వల్ల మీ చేతులు అందంగా కాంతివంతంగా తయారవుతాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే పాటించించండి.                    

మరింత సమాచారం తెలుసుకోండి: