చ‌క్కెర లేదా పంచ‌దార‌.. అంటే తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌తి ఇంట్లో ఇది చాలా కామెన్‌గా ఉంటుంది. ఎందుకంటే టీ, కాఫీలలో మనం ఎక్కువగా చక్కెరను వాడుతుంటాం. అయితే ఈ చ‌క్కెర ఆరోగ్యానికి ఎంత లాభం..? ఎంత న‌ష్టం..? అన్న‌వి ప‌క్క‌న పెడితే.. సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంతో మాత్రం ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి దీన్ని ఎలా యూజ్ చేయాలి..? అన్న‌ది చాలా మందికి అవ‌గాహ‌న ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను ఫాలో అయితే స‌రిపోతుంది. అందులో ముందుగా ట్యాన్ తొల‌గించ‌డానికి చ‌క్కెర ఎంతో చ‌క్క‌గా స‌హాయ‌ప‌డుతుంది.

 

దీని కోసం ఒకబౌల్లొకి ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ టమాటో జ్యూస్, ఒక స్పూన్ శేనగపిండి వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అర గంట పాటు ఉంచాలి. తర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా వారినికి రెండు సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ఒక బౌల్‌లో బాదం నూనె మ‌రియు చక్కెర రెండూ తీసుకుని బాగా మిక్స్ చెయ్యండి. ఈ మిశ్ర‌మాన్ని వృత్తాకారంలో ముఖంపై నలువైపులా విస్తరించునట్లు అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగెయ్యాలి.

 

దీనిని వారానికి కనీసం ఒకసారి చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు తొల‌గ‌డ‌మే కాకుండా కాంతివంతంగా చేస్తుంది. అదేవిధంగా, చ‌క్కెర‌లో కొన్ని అరటిపండు ముక్కలు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని మర్దన చేసుకుని కాసేపటి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. మ‌రియు ఒక బౌల్‌లో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ బియ్యప్పిండి, ఒక స్పూన్ పాలు వీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అర గంట త‌ర్వాత క్లీన్ చేసుకుంటే ఫేస్ గ్లోయింగ్‌గా మారుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: