ఈ సృష్టిలో ప్ర‌కృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు కూడా ఒక‌టి. ఆకుకూరలు యాంటిఆక్సిడెంట్‌ పదార్థాలు కల్గి ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనకు చౌకగా లభించే ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మనం సాధారణంగా వాడే ఆకుకూరల్లో తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, పాలకూర, పుదీనా, చింతచిగురు, క‌రివేపాకు, బచ్చలకూర ఇలా ఎన్నో వాడుతుంటాం. ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. శరీర ఎదుగుదల, దృఢత్వం, చక్కటి ఆరోగ్యానికి దోహదపడతాయి.

 

అయితే ఈ ఆకుకూర‌లు కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు సౌంద‌ర్య సాధ‌న‌ల్లో కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆకుకూర‌త‌లు డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అందమైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు. ఏ సీజన్ లో అయినా పుదీనా దొరుకుతుంది. పుదీనాతో ఎల్లవేళలా ముఖంను చల్లగా ఉంచ‌డ‌మేగాక‌ పుదీనా బ్యాక్టీరియాను చంపుతుంది. చర్మం లోపల దాగిఉన్న దుమ్ము, దూళి, క్రిములను వెలికితీస్తుంది. దీని కోసం పుదీనా ఆకుల‌ను పేస్ట్ చేసి ముఖానికి ప‌ట్టి పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే స‌రిపోతుంది. అలాగే ఆకుకూర‌లు కేశ సౌంద‌ర్యానికి కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

 

ముందుగా అవిసె ఆకులలో ఒక కప్పు గోరింటాకు, అర కప్పు ఉసిరిపొడి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు త‌ల‌కు నూనె రాసి ఇప్పుడు ముందుగా త‌యారు చేసుకున్న మిశ్ర‌మం త‌ల‌కు ప‌ట్టించారు. అర గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే.. జ‌ట్టు రాల‌డం, పొడి జుట్టు, చండ్ర స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అదేవిధంగా, కొత్తిమీరను తీసుకుని ర‌సం చేసుకోవాలి. ఆ రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది. మ‌రియు విటమిన్‌‌– ఎ, బీటా కెరటిన్‌‌లు పాల‌‌కూర‌‌లో పుష్కలంగా  ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తాయి. పాల‌‌కూర‌‌ను రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం కాంతివంత‌గా కనిపించేలా చేస్తుంది.

   
  

మరింత సమాచారం తెలుసుకోండి: