లిప్ స్టిక్.. నేటి త‌రం అమ్మాయిలు ఇది లేకుండా బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్ట‌మే అని చెప్పాలి. ఎందుకంటే.. ఆడాళ్లకి, లిప్ స్టిక్‌కి విడదీయరాని అనుబంధం ఉంది కాబ‌ట్టి. లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల మన ముఖానికి ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది. అందుకే లిప్ స్టిక్ అంటే అమ్మాయిలు ప‌డి చ‌చ్చిపోతారు. అంతగా లిప్ స్టిక్‌కి అడిక్ట్ అయ్యారు. అయితే ఎంత తిక్‌గా లిప్ స్టిక్ వేసుకున్నా కొన్ని గంట‌ల‌కే అది పూర్తిగా మాయం అయిపోతుంది. దీంతో ప్ర‌తి సారి అద్దంలో చూసుకుని లిప్ స్టిక్ వేసుకోవాల్సి వ‌స్తుంది. వాస్త‌వానికి లిప్‌స్టిక్‌ వేసుకోవడానికి కూడా కాసింత కళాపోషణా... కూసింత ఓపికా అవసరమే. ఎంచుకునే రంగూ, వేసుకునే విధానం తెలిసినప్పుడే దాన్ని మనం బాగా ఉపయోగించుకోగలుగుతాం.

 

అలాగే లిప్ స్టిక్ వేసుకున్న‌ప్పుడు కొన్ని సింపులు టిప్స్ పాటిస్తేనే.. దాన్ని ఎక్కువ‌సేపు మ‌న పెద‌వుల‌పై ఉంచుకోగ‌లం. మ‌రి ఆ టిప్స్ ఏంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా లిప్ ప్రైమర్‌ను యూజ్ చేయ‌డం వ‌ల్ల‌ లిప్ స్టిక్ రంగును ఎక్కువసేపు నిలిచివుండేలా చేస్తుంది. అది ఎందుకంటే.. లిప్ ప్రైమర్ లో ఉండే పదార్థాలు లిప్ స్టిక్ ఎక్కువకాలం పనికొచ్చేలా చేస్తాయి. ఇక లిప్ స్టిక్ ఎక్కువ సమయం ఉండాలనుకుంటే.. మీరు ముందుగా పెదవులపై మృతకణాలను, ప‌గిలిపోయిన‌ చర్మాన్ని తొలగించటానికి ఎక్స్ ఫోలియేట్ చేయాలి. 

 

తర్వాత మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ పెదవులకి రాసుకోండి, దాంతో మీ పెదవులు మృదువుగా, మెత్తగా ఉంటాయి. మృదువైన పెదవులపైనే లిప్ స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది. అదేవిధంగా, బ్లాటింగ్ అనేది చాలా ఈజీ మ‌రియు ప్రభావం చూపే మంచి టిప్‌. బ్లాటింగ్ అదనపు నూనెలు పీల్చుకోవ‌డ‌మే కాదు లిప్ స్టిక్ చెదిరిపోకుండా, కరిగిపోకుండా ఎక్కువ స‌మ‌యం ఉండేలా కూడా చేస్తుంది. మ‌రియు లిప్ స్టిక్ ఎక్కువ టైమ్ ఉండాలంటే..‌ పెదవులంతా సన్నని పొరలా లిప్ స్టిక్ ను వేయండి. తర్వాత టిష్యూ పేపర్ ను తీసుకుని మీ పెదవుల మధ్యలో ఉంచుకుని కొన్ని సెకన్ల పాటు పెదవులను దగ్గరకు వత్తండి. తర్వాత అదే లిప్ స్టిక్ మరో కోటింగ్ వేస్తే స‌రిపోతుంది.
 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: