వేసవిలో అందరూ ప్రధానంగా ఎదుర్కొనే ఏకైక సమస్య చెమట. వద్దనా వరదలా పొంగుకొస్తుంది. కొందరికైతే శరీరం అలవాకుండానే చెమట కారిపోతుంది..మరి కొందరికి చిన్న పని చేసినా చొక్కా తడిచిపోయెలా చెమట పడుతుంది. ఇక అప్పటినుంచీ చెమట ద్వారా వచ్చే వాసనని తట్టుకోవడం పక్కన కూర్చున్న వారివల్ల కానే కాదు. అదేదో మురికి గుంట పక్కన కూర్చున్నట్టుగా మన పక్కన కూర్చుని ముక్కు మూసుకుంటారు. ఇది మరీ అవమానం మనకి మరి అలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలంటే..

IHG

 

చెమట వాసన పోవడానికి మార్కెట్ లో దొరికే రసాయనిక ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదు. వంటింట్లో  దొరికే వాటితోనే చెమట వాసనని పోగొట్టుకోవచ్చు. ఇంట్లోనే మనకి బేకింగ్ సోడా దొరికుతుంది. ఇది చెమట  వాసన పోగొట్టడమే కాదు సూక్ష్మ క్రిముల్ని సైతం నాశనం చేస్తుంది. చెమట పట్టే ప్రదేశంలో రాస్తే ఆ ప్రాంతాన్ని పొడిగా ఉంచుతుంది. అంతేకాదు ఇలా రాసిన తరువాత ఒక పావుగంట పాటు ఉంచి వేడి నీటితో వాసనా పోయే వరకూ కడుగుతూ ఉండాలి.

IHG

నిమ్మకాయ కూడా చెమట వాసనని దూరం చేస్తుంది. చెమటని కలిగించే బ్యాక్టీరియా తొలగించడంలో నిమ్మకి సాటి మరొకటి లేదనే చెప్పాలి. నిమ్మ కాయని తీసుకుని రెండు చెక్కలుగా కోసి చంకలలో బాగా రుద్దుకోవాలి. చెమట వాసన పోయే వరకూ రుద్దడం మంచిది. కొందరు నిమ్మకాయం చెక్కపై సోడా ఉప్పు వేసుకుని కూడా రుద్దుకుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రత్యేకించి చెమట పట్టడానికి మసాలా పదార్ధాలు తినడం వలన కూడా జరుగుతుంది. అందుకే తీసుకునే ఆహారంలో  వీలైనంతగ  మసాలాలు దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి వంటింటి చిట్కాలు పాటించి చెమట నుంచీ మనల్ని దూరం చేసుకోవచ్చు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: