అందం.. ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదే.. అందంగా ఉండాలి అని.. అయితే అందం కోసం బ్యూటీ పార్లర్స్ కి వెళ్లేవారు.. కానీ నిజానికి బ్యూటీ పార్లర్ కంటే కూడా అందంగా ఉండటానికి ఇంటి చిట్కాలే బాగా పని చేస్తాయ్.. నిజానికి ఇప్పుడు ఎవరు కూడా పార్లర్ కి వెళ్లే అవకాశం లేదు.. దీనికి కారణం లాక్ డౌన్.. అందుకే అందానికి ఇంట్లోనే సహజమైన చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకొని పాటించండి.. అందంగా ఉండండి. 

 

బొప్పాయిపండు.. 

 

అందానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పండు.. ముఖంపై మచ్చలు.. నలుపు అన్ని పోగొడుతాయి.. అయితే ఆ బొప్పాయి ఎలా వాడాలి అంటే.. బొప్పాయిపండు గుజ్జుని కళ్ళకు తగలకుండా ముడతలు, మచ్చలు మీద పట్టింది అరగంట తర్వాత కడిగేస్తే మచ్చలు, ముడతలు అన్ని తొలిగిపోతాయి. 

 

పచ్చి శనగ పప్పుని 10 గంటలు నానబెట్టి ఉదయం రుబ్బి అందులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత మంచినీటితో కడిగితే ముఖం కాంతి వంతంగా తయారయ్యి అందంగా కనిపిస్తుంది. 

 

తులసి ఆకుల గుజ్జును నిద్ర పోయే ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే చల్లటి నీటితో కడిగితే ముఖం తెల్లగా అవుతుంది. 

 

పెరుగులో శనగపిండి కలిపి ముఖానికి పట్టింది కొద్దీ సేపు తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ఎంతటి మొండి మొటిమలైన మాయం అవుతాయి.. అంతేకాదు.. అలాంటి మొటిమలకు టమాటా లేదా వెల్లుల్లి లేదా పుదీనా పట్టించిన మొటిమలు మాయం అవుతాయి. 

 

పెరుగు, గోరింటాకు, గుడ్డు తెల్లసొన కలిపి కొన్ని గంటల పాటు బాగా నాననిచ్చి పట్టించి ఆరిన తర్వాత కుంకుడుకాయ రసంతోతలస్నానం చేస్తే ఎంతటి మొండి చుండ్రు అయినా మాయం అవుతుంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: