టూత్ పేస్టు.. తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌తి రోజు ఉద‌యం లేవ‌గానే ప‌ళ్ల‌ను శుభ్రం చేసుకునేందుకు టూత్ పేస్ట్ తెగ వాడేస్తుంటారు. కానీ, దీన్ని ప‌ళ్ల‌కు మాత్ర‌మే ఉప‌యోగించ‌వ‌చ్చు అనుకుంటే పొర‌పాటు. పేస్ట్ దంతాలు శుభ్రం చేసుకోవడానికే కాదు దాంతో మరెన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంతో టూత్ పేస్ట్ ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రియు అమ్మాయిలే కాకుండా.. అబ్బాయిలు అబ్బాయిలు కూడా టూత్ పేస్ట్‌ను చ‌ర్మానికి యూజ్ చేయ‌వ‌చ్చు. అది ఎలాగో.. ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే అందం మొత్తం మీదే.

 

ఇందులో ముందుగా.. చర్మం తెల్లబడటంలో టూత్ పేస్టు అద్భుతంగా పనిచేస్తుంది. టానింగ్ కూడుకున్న చర్మానికి ఉపశమనంగా పనిచేయడమే కాకుండా, చర్మం నిగారింపుకు తోడ్పాటుని అందిస్తుంది. అయితే చ‌ర్మానికి వైట్ టూత్ పేస్ట్ మాత్ర‌మే యూజ్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ టూత్ పేస్టులో కొద్దిగా నిమ్మ రసం కలిపి ముఖానికి అప్లై చేయండి. మీ ముఖం మీది చర్మం టోన్ను మెరుగుపరచడానికి ఒక ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. ఒక గిన్నెలోకి కొంచెం టూట్ పేస్ట్ తీసుకోవాలి. అందులో తేనె వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావు గంట‌ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల‌ మొటిమల సమస్య త‌గ్గుతుంది. అదేవిధింగా,  టూత్ పేస్టుల సహాయంతో ముడతలు తొలగిపోతాయి. ఇందుకు మీరు చేయాల్సింద‌ల్లా ఆ ప్రదేశంలో కొద్దిగా టూత్‌పేస్ట్‌ను పూసి రాత్రిపూట అలా వదిలివేయండి. మరుసటి రోజు శుభ్రం చేసుకుంటే మంచి ఫ‌లితం పొందొచ్చు. మ‌రియు ముఖ జుట్టును తొలగించడానికి టూత్‌పేస్ట్, నిమ్మ రసం మరియు ఉప్పు లేదా చక్కెర కలయికను యూస్ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడిటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: