సాధార‌ణంగా కాఫీని చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీ పడితేనే ఆరోజు ప్రారంభం అయినట్లు కాఫీ ప్రియులు భావిస్తారు. ఎందుకంటే కాఫీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు, రుచి ఉంటుంది. దానికి అల‌వాటు ప‌డ్డ‌వారు కాఫీ లేనిదే ఉండ‌లేరు. కాఫీలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉంటాయి. కాబట్టి, ఇవి ప్రత్యేకంగా కొన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది. అయితే కాఫీ మితంగా మాత్ర‌మే తీసుకోవాలి. ఇక కాఫీ పొడి అందంగా మెర‌వ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న విష‌యం తెలిసిందే. కానీ, దీన్ని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది మాత్రం అవ‌గాహ‌న‌ ఉండ‌క‌పోవ‌చ్చు.

 

అలాంటి వారు ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ పాలిస్తే.. మీ చ‌ర్మం జిగేల్ మ‌నాల్సిందే. ఇందులో ముందుగా ఒక బౌల్ లో కొద్దిగా కాఫీ పొడి, కొద్దిగా తీసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ పేస్టును మీ మొహంపై సమానంగా పట్టించి కాసేపు మసాజ్ చేయండి. అర గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖం క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మంపై చనిపోయిన కణాలను తొలగించి ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. మ‌రియు ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అలాగే ఒక బౌల్‌లో ఒక‌ స్పూన్ కాఫీ పౌడర్ కు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి మెడకు అప్లై చేసి పావు గంట‌ తర్వాత వాటర్ తో కడగాలి. 

 

 ఇది వారానికి రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు తొల‌గుతాయి. ఒక బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ షుగర్ ను అలాగే ఒక టేబుల్ స్పూన్ కాఫీను తీసుకోవాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ ను మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని ముఖంపై సర్క్యూలర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకున్న జిడ్డు, మ‌లిణాలు తొల‌గి ప్ర‌కాశ‌వంతంగా చేస్తుంది. ఇక మొటిమల సమస్యతో ఇబ్బందిపడేవారు కాఫీ గింజలను గ్రైండ్‌ చేసుకొని దాంట్లో చిటికెడు ఉప్పు, ఆలివ్‌ నూనె కలపాలి. మ‌రియు ఇది ముడతల్ని కూడా దూరం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: