అయినా వేసవి అయితే ఏంటి చలికాలం అయితే ఏంటి.. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉండాలి కదా!  ఎందుకంటే లాక్ డౌన్ దెబ్బ.. అయినా సరే.. ఇంట్లో ఉన్నప్పటికీ మనం ఈ వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. లేకుంటే చర్మం దెబ్బ తింటుంది.. కాబట్టి ఇక్కడ ఉన్నదా జాగ్రత్తలు పాటించి మీ చర్మాన్ని కాపాడుకోండి.. 

 

వేసవి కాలం కాబట్టి సాధారణంగానే మన శరీరంలో తేమ తగ్గిపోతుంది. ఇంకా బయటకు ఒక్క నిమిషం వెళ్లిన సరే ఆ ప్రభావం రెట్టింపు అయ్యి చర్మం కమిలిపోతుంది. అలాంటి సమయంలో ముఖం, మెడ, చేతులకు రోజ్ వాటర్ పట్టించి ఆ తర్వాత మాయిశ్చర్ క్రిము రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా అవుతుంది.. 

 

ఇంకా వేసవి కాబట్టి చర్మం బాగా పొడిబారుతుంది.. ఇంకా మాటిమాటికీ సబ్బుతో కడిగితే చర్మం మీద సహజసిద్ధమైన తైలాలు పోతాయి.. పొడిబారుతాయి.. అందుకే వేసవిలో ఎక్కువ సబ్బు బదులు చల్లని నీటితో కాళ్ళు, ముఖం కడుక్కోవడం మంచిది. 

 

ఇంకా ఇంట్లోనే భరించలేని వేడి, ఉక్కపోత, చెమట కారణంగా వేసవిలో దాహంతో నిమిత్తం లేకుండా ప్రతి అరగంటకూ నీరు తాగడం మంచిది. అప్పుడే చర్మ ఆరోగ్యం బాగుంటుంది. 

 

వేసవిలో లేత రంగుల పల్చటి కాటన్ దుస్తులు ఉపయోగించటం మంచిది. 

 

వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.. పండ్లు, కూరగాయల వంటివి తీసుకోవడం మంచిది. మాంసాహారం పగటివేళల్లో తీసుకోవడం మంచిది.. రాత్రి సమయంలో మసాలా తీసుకోవడం వల్ల అరుగుదల ఉండదు. 

 

ఈ వేసవిలో రోజుకు కనీసం గ్లాసు చొప్పున మజ్జిగ, పండ్ల రసం, రాగి జావ, సబ్జా గింజల నీరు వంటివి తీసుకోవాలి.. ఇలా చెయ్యడం వల్ల దాహం తీరుతుంది. చర్మం తాజాగా కూడా ఉంటుంది. 

 

చూశారు కదా! ఈ వేసవిలో ఈ చిట్కాలు పాటించండి.. చర్మాన్ని సంరక్షించుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: