చూయింగ్ గమ్.. వీటిని సాధార‌ణంగా చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఒత్తిడిగా అనిపించిన‌ప్పుడు, పని చేస్తున్నప్పుడు నిద్రవచ్చిన‌ప్పుడు, డ్రైవింగ్ చేసేట‌ప్పుడు.. ఇలా ఎన్నో సంద‌ర్భాల్లో చూయింగ్ గ‌మ్ నోట్లో వేసుకుని తెగ న‌మిలేస్తుంటారు. వాస్త‌వానికి చూయింగ్ గమ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఒకప్పుడు చెప్పేవారు. అంతేకాదు చిన్నపిల్లలకైతే చూయింగ్ గమ్ మింగడం వల్ల అది లోపల ప్రేగులను చుట్టేస్తుందని భయపెట్టేవారు. అయితే ఇదంతా ఉత్తమాటలే అంటున్నారు ప‌రిశోధ‌కులు. షుగర్ లేని చూయింగ్ గమ్ లిమిట్ తీసుకోవ‌చ్చంటున్నారు. 

 

చూయింగ్ గమ్ నమలడం వల్ల పని మీదే ధ్యాస పెట్టడానికి వీలవుతుంది. ఏదైనా పనిచేస్తున్నప్పుడు చూయింగ్ నమలడం వల్ల మరింత అప్రమత్తంగా ఉండ‌గ‌ల‌రు. అయితే చూయింగ్ గ‌మ్ తింటే ముఖం అందంగా మారుతుంద‌ని ఎంత మందికి తెలుసా..? నిజానికి ఇది చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుస‌ని చెప్పుకోవాలి. సాధార‌ణంగా ముఖంలో ఎక్కువగా కొవ్వు ఉండడం వ‌ల్ల పేస్‌ చాలా లావుగా ఉంటుంది. ఈ స‌మ‌స్య చాలా మందిని బాధపెడుతుంటుంది. దీని వల్ల మీరు అందవిహీనంగా కూడా కనపడతారు. అలాంటి వారు కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలి. అందులో ముఖ్యంగా ఫేస్ ఎక్సర్‌సైజ్. 

 

ఫేస్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ముఖ రూపాన్ని మెరుగుపడడమే కాకుండా, వృద్ధాప్యాన్ని ఎదుర్కోవటానికి, కండరాల బలం కూడా పెరుగుతుంది. అయితే  ఫేస్ ఎక్సర్‌సైజ్‌లో ఫుల్ ఫేమస్ అయిన ఎక్సర్‌సైజెస్ ఏంటంటే.. మీ బుగ్గలను ఉబ్బినట్టు ఉంచి బయటికి గాలి వదలడం. అందులో చూయింగ్ గమ్‌ తినడం ముఖానికి చక్కని ఎక్సర్‌సైజ్. దీని వల్ల ముఖంపై ఉండే కొవ్వు కరుగుతుంది. ముఖం అందంగా మారుతుంది. అయితే, ఎక్కువగా చూయింగ్ తినకూడదు. ఇది ఇత‌ర అనారోగ్యాలు తెచ్చిపెడుతుంది. కాబ‌ట్టి.. లిమిట్‌గా చూయింగ్ గ‌మ్స్ న‌ములుతూ.. అందంగా మారండి. దీంతో చేపలలా బుగ్గలను లోపలికి మడిచి నవ్వేందుకు ప్రయత్నించండి. ఇలా కూడా ముఖంలో కొవ్వును క‌రిగించేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: