గోళ్లు.. వీటిని అందంగా చూసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. వాస్త‌వానికి గోళ్లు మనకు చేతివేళ్లకు కాలివేళ్లకు రక్షణ కవచాల్లాగ ఉంటాయి. అంతేకాదు..  గోళ్లరంగు బట్టి, వాటి అందమైన ఆకృతిని బట్టి అందాన్ని ఊహించవ‌చ్చ‌ట‌. మ‌రియు గోళ్లలో వచ్చే మార్పుల ఆధారంగా కొన్ని రుగ్మతలను కూడా  కనిపెట్టగలిగే వీలుంది. ఇక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పెరుగుతూనే ఉంటాయి. చేతివేళ్ల గోళ్లు నెలకు సుమారుగా మూడు మిల్లీమీటర్ల పొడవు పెరుగుతాయి. అందుకే వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు క‌ట్ చేస్తూ ఉంటాలి. అయితే గోళ్ల‌ను క‌ట్ చేసేట‌ప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే.. అవి అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా మార‌తాయి.

 

గోళ్ల‌ను క‌ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. పదునైన సాధనాలతో కత్తిరించు కోవడం వల్ల ఒకోసారి గోటి చిగుళ్ళు దెబ్బతిని పెరుగుదల ఆగిపోయె ప్రమాదం ఉంది. కాబ‌ట్టి, చాలా జాగ్ర‌త్త‌గా గోళ్ల‌ను క‌ట్ చేసుకోవాలి. అలాగే గోళ్ళు కత్తిరించుకునే ముందు చేతిని కొంచెం నులివెచ్చటి నిటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఈజీగా గోర్లు క‌ట్ అవుతాయి. ఇక కొందరు ఆఫీస్‌లో ఉన్నా, టీవీ చూస్తున్నా అసంకల్పితంగా గోళ్లు కొరుకుతుంటారు. ఎదుటి వ్యక్తులు చెబుతున్నా పట్టించుకోరు. కానీ, అలా చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

 

మ‌రియు గోళ్ల పెరుగుదలపై దెబ్బ ప‌డుతుంది. సో.. గోళ్లు కొర‌క‌డం మానేసి.. క‌నీసం వారానికి ఒక‌సారి అయినా క‌ట్ చేసుకోండి. అదేవిధంగా, నెయిల్ పాలిష్ అదే పనిగా ఎక్కువసార్లు వాడటం వల్ల విటిలో ఉండే కెమికల్ మీ గోళ్ళను పాడు చేసే ప్రమాదం ఉంది. కాబ‌ట్టి, ముఖ్య సంద‌ర్భాల్లో త‌ప్పా.. మిగిలిన స‌మ‌యంలో నెయిల్ పాలిష్‌కు దూరంగా ఉండండి. మ‌రియు గోళ్ళు పాడవకుండా ఉండటానికి నెయిల్ పాలిష్ల‌ కన్నా ప్రకృతిలో దొరికే గోరింతాకు రుబ్బి పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దినిలో ఉండే అనేక ఔషదగుణాలు మీ గోళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: