అందం కోసం తాప‌త్ర‌య‌ప‌డ‌ని వారుండ‌రు. ముఖ్యంగా అమ్మాయిలు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు. వేల‌కు వేలు త‌గ‌లేసి బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తెగ తిరిగేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌యోజనం లేక నిరాశ చెందుతుంటారు. అందంగా కనిపించాలంటే అది చర్మం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ పాటిస్తే.. మేక‌ప్ లేక‌పోయినా మెరిసిపోవ‌చ్చు. మ‌రి అవేంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. చర్మ ఆరోగ్యానికి మీ ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 

ఆరోగ్యమైన చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చాలా ముఖ్యం.  ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండి, వీలైనంత శుభ్రంగా ఉండే ఆహారం తినండి. అలాగే పండ్లు, కూరగాయలు, ఆకుకూర‌లు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి డైట్‌లో ఖ‌చ్చితంగా చేర్చుకోవాలి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా హానికర‌మే అన్న విష‌యం తెలుసుకోండి. పొగాకు వల్ల చర్మంలో రక్త ప్రవాహం తగ్గడంవల్ల ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ. అదేవిదంగా మద్యపానం అతిగా తాగే వారిలో చర్మం పొడిబారుతుంది. ఈ రెండూ మీ చ‌ర్మాన్ని కాంతిహీనంగా త‌యారు చేస్తుంది.

 

కాబ‌ట్టి వీటికి దూరంగా ఉండండి. అదేవిధంగా, మంచి నిద్ర మీ చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంతో పాటు అందంగా కూడా త‌యారు చేస్తుంది. సరైన నిద్ర లేని వారి ముఖం నిర్జీవంగా మరియు బిగుసుకు పోయిన చర్మాన్ని కలిగి ఉంటారు. అందుకే ప్ర‌తి రోజు ఎనిమిది గంటల పాటు నిద్రించడం చాలా అవ‌స‌రం. ఇది ఆరోగ్యానికి, అందానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రియు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ చాల అవ‌స‌రం. ముఖ్యంగా వేసవిలో చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎండల వేడి చర్మం మీద ప్రసరించినప్పుడు చర్మం కందిపోయి నల్లగవడం, నల్లమచ్చలు రావడం, చర్మానికి ముడతలు ఏర్పడటం లాంటి సమస్యలు వ‌స్తుంటాయి. స‌న్‌ స్క్రీన్‌ లోషన్ చర్మానికి రాయడం వల్ల, ఇటువంటి ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: