నూనె ? ఎందుకు అద్భుతం చేస్తుంది? ఎక్కడ అద్భుతం చేస్తుంది అని అనుకుంటున్నారా.. అదేనండి.. కొబ్బరి నూనె.. శరీరానికి.. అందానికి ఎంతో సాయం చేస్తుంది. అయితే అది ఎలా సాయం చేస్తుంది? కొబ్బరి నూనె వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

కొబ్బరి నూనెను వేడి చేసి రాత్రి పడుకోబోయే ముందు జుట్టుకు పట్టించి బాగా మర్దన చేసి తలా స్నానం చేస్తే పొడిబారటం తగ్గుతుంది.                             

 

గోరు వెచ్చని కొబ్బరి నూనెలో కొన్ని చుక్కలు టీ ట్రీ నూనె వేసి మెడకు పట్టించి బాగా మర్దన చెయ్యాలి. అంతే చుండ్రు తగ్గుతుంది.                          

 

మెంతులను రాత్రంతా నానబెట్టి ఆ నీటిలో కొబ్బరి నూనె కలిపి జుట్టు కుదుళ్లకు, వెంట్రుకలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి.             

 

కొబ్బరినూనెలో కొన్ని చుక్కల టీ ట్రీ నూనె వేసి బాగా కలపాలి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.                            

 

రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె పట్టించి సాక్సు వేసుకొని పాడుకోవాలి ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పాదాల పాగుళ్లు మాయం అవుతాయి.         

 

వంటలకు ఉపయోగించే స్వచ్ఛమైన కొబ్బరి నూనెని పడుకునే ముందు నోటి పుండ్లకు రాస్తే ఉదయం నోటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: