జుట్టు ఒత్తుగా, అందంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. కానీ, కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం, చుండ్రు, చిట్లిపోవ‌డం, పొడిబారడం ఇలా ర‌క‌ర‌కాలు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. ఈ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాస్త‌వానికి జుట్టు అనేది అందాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి జుట్టుని కాపాడుకునేందుకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌లైనా మాయం అవ్వాల్సిందే. మ‌రి లేట్ చేయ‌కుండా అవేంటో తెలుసుకుందాం. ఇందులో ముందుగా.. వారానికి రెండుసార్లు తలస్నానం చేయడం మంచిది. 

 

కానీ అంతకంటే ఎక్కువగా హెడ్ బాత్ చేస్తే జుట్టు సహజత్వాన్ని కోల్పోవ‌డంతో పాటు బ‌ల‌హీనంగా మార‌తుంది. అలాగే  మీ జుట్టు కాస్త డ్రై గా లేదా పొడిగా ఉన్నట్లయితే గుడ్డును ఉపయోగించాలి. ఒక హాప్ కప్ నిండా గుడ్డులోని తెల్లసోన మిశ్రమాన్నితీసుకోవాలి. దాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. పావు గంట త‌ర్వాత క్లీన్ చేసుకుంటే స‌రిపోతుంది. ఇక తలస్నానం పూర్తయిన తర్వాత కచ్చితంగా ఓ మగ్గుడు చల్లటి నీటిని తలపై పోసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. చల్లటి నీరు వేడి నీటి వల్ల జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందిస్తుంది. జుట్టు పొడిబారిపోకుండా కాపాడుతుంది.

 

అదేవిధంగా, ఒక స్పూన్ నిమ్మరసాన్ని మీ జుట్టుకు రాయండి. తర్వాత టవల్ తో తుడుచుకోండి. పొడిగా ఉంటే మీ జుట్టు దీని ద్వారా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే జుట్టు రాలే సమస్యకు వేప మంచి ఫలితాన్ని ఇస్తుంది. వేప నూనెను తలకు రాసుకుంటే జట్టు రాలే సమస్యతో పాటు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు ఉన్నా తగ్గుతాయి. అదే విధంగా వేపాకు కూడా బాగా నూరి పేస్ట్ లా తయారు చేసి దాన్ని తలకు పట్టించినా జుట్టు సమస్యలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. మ‌రియు జుట్టు ఆరబెట్టుకోవడానికి వాడే హెయిర్ డ్రైయర్లకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దీనివల్ల జుట్టు చిట్లిపోతుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: