నిజం.. మనం తరుచు ఇంట్లో ఉపయోగించే శనగపిండి, గోధుమపిండి, మైదా పిండి ఇప్పుడు పెసర పిండి. ఇలా ప్రతి ఒక్కటి మన శరీరానికి ఎంతో అందాన్ని తీసుకొస్తుంది.. ఇంకా పెసర పిండి విషయానికి వస్తే పెసర పిండి చేయకముందు పప్పుని మనం నానబెట్టుకొని తింటే మన ఆరోగ్యం ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలానే ఈ పెసర పిండి అందానికి కూడా ఎంతో సాయం చేస్తుంది.. 

 

ముఖం.. చర్మం.. జుట్టు ఇలా ప్రతి ఒక్క సమస్యకు పెసలతో చెక్ పెట్టచ్చు.. ఇంకా అలాంటి పెసర పిండిని అందం కోసం ఎలా ఉపయోగించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

కొన్ని పెసలని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టి, పొద్దున్న వాటిని మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి ఈ పేస్ట్ అప్లై చెసి పదిహేను నిమిషాల పాటూ ఉంచాలి.. ఆ తరువాత నీటితో కడిగేసి ముఖాన్ని మెత్తటి బట్టతో క్లీన్ చేసుకోండి. ఇక అంతే చర్మం మృదువుగా తెల్లగా మెరిసిపోతుంది. 

 

పెసలని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్ట్ చేసి అందులో కాస్త నెయ్యి కలిపి ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చెయ్యాలి.. ఇంకా ఆతర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి.. ఇలా చేస్తే మొటిమల సమస్య ఇట్టే తగ్గిపోతుంది. 

 

పెసర పిండి బాగా నానబెట్టి అందులో చల్లటి పెరుగు, అలోవెరా జెల్ వేసి కలిపి ఎండ వల్ల కుమిలిపోయిన చర్మంపై ఈ పేస్ట్ అప్లై చెయ్యాలి.. పది నిమిషాల చెయ్యాలి.. ఇలా చెయ్యడం వల్ల నలుపు తగ్గి అందంగా తయారవుతారు.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: