జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి నూనె రాయడం చాలా అవ‌స‌రం అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే కేశాల‌కు నూనె రాసుకోవడం మన జీవనశైలిలో భాగంగా మారిపోయింది. ఇక కొందరికి రోజూ.. మరికొందరికి వారానికోసారి నూనె రాసుకోవడం అలవాటు. అయితే వారానికి కనీసం ఒక్కసారైనా నూనె పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ పై ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మ‌రియు చుండ్రు సమస్య అరిక‌ట్ట‌డంతో పాటు వెంట్రుకల కుదుళ్లకు తగిన  పోషణ అందుతుంది. 

 

ఇక నూనె.. పొడి జుట్టుకు పోషకాలను అందించి ఆరోగ్యకర జుట్టుకు పెరుగుదలకు ప్రోత్సాహకం ఇస్తుంది. అదేవిధంగా, తలకు తరచుగా నూనెను అప్లై చేయడం, క్రమంగా మీ తలకు మర్దనను అనుసరించడం ద్వారా, రక్త నాళాలలో మంచి సర్క్యులేషన్‌ను ప్రోత్సహిస్తుంది. క్రమంగా జుట్టును మృదువుగా చేయడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. అయితే బ‌య‌ట‌కు వెళ్లే ముందు మాత్రం త‌ల‌కు నూనె రాయ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఒక‌వేళ ఖ‌చ్చితంగా రాయాలి అనుకుంటే ముందురోజు రాత్రి రాసుకోవాలి. ఎందుకంటే.. దుమ్ముని ఆకర్షించే గుణం నూనెకి ఎక్కువగా ఉంటుంది. మనం తలకి నూనె రాసి బయటికి వెళ్లాలనుకున్నప్పుడు బయట ఉండే దుమ్ము, ధూళి తలని పట్టేస్తాయి. 

 

దీంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌, చండ్రు, జుట్టు రాలిపోవ‌డం ఇలా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇక త‌ల‌స్నానానికి ముందు జుట్టుకు నూనె అప్లై చేస్తే చాలా మంచిది. మీరు తలస్నానం చేయాలనుకొన్న ప్రతి సారీ ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది. అలాగని రోజూ తలస్నానం చేయడం కూడా మంచిది కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. కొంతమంది తలస్నానం చేసిన తర్వాత నూనె రాసుకొంటూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా జుట్టు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. సో.. బీ కేర్‌ఫుల్‌..!!

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: