సాధార‌ణంగా జుట్టు ఆరోగ్యం, అందంగా ఉండాల‌ని ప్ర‌తిఒక్క‌రూ కోరుకుంటారు. ఆడవారికి మాత్రమే కాదు.. మగవారు కూడా జుట్టును అల్లారు ముద్దుగా చూసుకుంటారు. కానీ, అందుకు విరుద్ధంగా మనం అనేక జుట్టు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాం. ఈ క్ర‌మంలోనే  జుట్టు సమస్యలను నివారించుకోవడానికి చాలామంది రకరకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయినా సమస్య మాత్రం అలాగే ఉంటుంది. జేబుకు మాత్రం చిల్లుపడుతుంది. అయితే జుట్టు సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి. పొల్యూషన్, పోషకాహార లేమి, సరైన జీవన విధానం లేకపోవడం, ఒత్తిడి, సరిపడని షాంపూలు, నూనెలు రాయడం, ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. 

 

ఇక ఈసారి మీ జుట్టు సమస్యలను నివారించుకోవడానికి నూనెలు, షాంపూలు కాకుండా ఇప్పుడు చెప్పుకుబోయే టిప్స్ పాటిస్తే.. మంచి ఫ‌లితం పొందొచ్చు. సాధార‌ణంగా వాజిలిన్‌ను ఎవ‌రైనా చ‌లికాలంలో చ‌ర్మం ప‌గిలితే వాడుతార‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఇది చ‌ర్మానికే కాదు జ‌ట్టు స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెడుతుంది. ఇందుకు ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో వాజిలిన్, విటమిన్ E క్యాప్సూల్స్, కొబ్బరినూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని తల మాడుకి పెట్టుకుని వృత్తాకారంలో ఓ ప‌ది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 

 

ఇది రాసుకుని ఒక‌రోజంతా అలా ఉంచేసి.. త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల అనేక జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గి.. ఒత్తుగా పెర‌గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. మ‌రియు జుట్టును బ‌లంగా త‌యారు చేస్తుంది. వాస్త‌వానికి వాజిలిన్‌లో మంచి మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉంటుంది. దీని వల్ల కేశ సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి. అయితే కేవలం ఈ చిట్కాని యూజ్ చేయ‌డం వల్ల మాత్రమే సమస్య మొత్తం దూరం అవుతుందని అనుకోవద్దు. దీనితో పాటు సరైన జీవనశైలి పాటిస్తూ.. త‌గిన పోష‌కాహారం తీసుకోవాలి. అప్పుడు మీ జుట్టు స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌తంగా దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: