నేటి కాలంలో చాలా మంది అనేక జుట్టు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారం వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈసమస్యను నివారించుకోవడానికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ మరియు చిట్కాలు అనుసరించినా ఎలాంటి ఫలితం లేక చాలా మంది బాధ‌ప‌డుతుంటారు.  జ‌ట్టు స‌మ‌స్య‌ల‌కు అనేక కారణాలు ఉంటాయి. కాలుష్యం,  ఒత్తిడి, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పోషకాహార లోపం ఇలా అనేక కార‌ణాలు వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటాం.

IHG

సహజంగా జుట్టుకి అందాల్సిన పోషకాలు అందుతున్నా సరే జుట్టు ఊడిపోతుంటే అప్పుడు మిగిలిన కారణాలని అన్వేషించాలి. తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే మాత్రం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అయితే అరటి పండు గుజ్జులో బీరు కలిపి తలకు పట్టిస్తే ఏమవుతుందో తెలిస్తే మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ ట్రిక్ జుట్టు రాలే సమస్యను అరిక‌డుతుంది. అంతేకాదు, జుట్టును బ‌లంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఇత‌ర జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

IHG

ఇందుకు మీరు చేయాల్సింది.. ముందుగా బౌల్‌లో ఒక‌ అరటి పండు పేస్ట్‌, ఓ అరకప్పు బీరు, ఒక గుడ్డు సొన తీసుకోండి. వీటిని కలిపి బాగా మెత్తగా అయ్యేలా చేయండి. తర్వాత దాన్ని మీ తలకు పట్టించండి. అలా ఓ రెండు గంటలు వదిలేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.  కాస్త మంటగా అనిపించినా ఫర్వాలేదు. ఇలా వారానికి ఓసారి చేయ‌డం వ‌ల్ల.. మీ జుట్టు పెరగడాన్ని కచ్చితంగా గమనిస్తారు. ఇది మీ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. ఇక‌ జుట్టు రాలిపోవడం తగ్గడమే కాదు, రాలిన మీ జుట్టు తిరిగి వస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: