వేసవి కాలం వచ్చేసింది. మండుతున్న ఎండ‌లు మొద‌ల‌య్యాయి. వడగాలులు, దాహం, నీరసం, అలసట... వీటితొ పాటు ఎక్కడ చూసిన చెమటలు కార్చుకుంటూ ఇబ్బంది పడిపోతుంటారు. వేసవిలో శరీరం తాజాగా కాంతివంతంగా ఉండాలంటే మాయిశ్చరైజర్లు, యాంటీపర్‌స్పిరెంట్లు, డియోడరెంట్లు, పెర్‌ ఫ్యూములు, సన్‌ స్క్రీన్లు ఎక్కువగా వినియోగిస్తారు. వీటితో పాటు కొన్ని స‌హ‌జ‌సిద్ధ‌మైన సింపుల్ టిప్స్ పాటిస్తే వేస‌విలోనూ అందంగా, కాంతివంతంగా మెరిసిపోవ‌చ్చు. అవేంటో ఓ సారి లుక్కేసేయండి.

 

ఇందులో ముందుగా.. బొప్పాయిని ఒక గిన్నెలో వేసి తేనె, నిమ్మరసం, గంధం, ముల్తానీ మట్టిని వేసి కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకొని అరాక గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా చేస్తే చాలు కాంతివంతమైన చర్మం మీ సొంతం. బొప్పాయి చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది. ఇది చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు ట్యాన్ తొల‌గిస్తుంది. అలాగే ఒక స్పూన్  నిమ్మ రసం, పాలుకలిపి రాత్రి ప‌డుకునే ముందు ఫేస్‌కు అప్లై చేసుకోవాలి. ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమల మచ్చలు పోతాయి.

 

అదేవిధంగా, ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. వాస్త‌వానికి స్కిన్ టోన్ మెరుగ్గా చేయడంలో పెరుగు బాగా పని చేస్తుంది. కాబట్టి ఈ పెరుగుతో చక్కగా ప్యాక్ వేసుకోవచ్చు. దీని వల్ల ముఖం అందంగా మెరిసిపోతుంది. ఇక ఒక చెంచా చింతపండు గుజ్జు తీసుకోండి. దీనికి ఉప్పు, చల్లని పెరుగుని కలపండి. దీన్నిపేస్ట్‌లా చేసి ముఖంపై రాయండి. ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేయండి. చింతపండులో యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని షైనీగా చేస్తుందిే, హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది.

 


  

మరింత సమాచారం తెలుసుకోండి: