అందం కోసం ప్ర‌తిఒక్క‌రూ ఆరాట‌ప‌డుతూనే ఉంటారు. ముఖ్యంగా ఎప్పటికి అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు కానీ కొందరే అందంగా ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆడవాళ్ళూ తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తారని అందరికి తెలుసు. ఇందుకోసం ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్స్ ఇలా ఎన్నో వాడుతుంటారు. వేల‌కు వేలు ఖ‌ర్చు చేసి బ్యూటి పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతుంటారు. కానీ, ప్ర‌యోజ‌నం లేక నివాశ చెందుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఓ సింపుల్ టిప్ పాటిస్తే.. ఎలాంటి చ‌ర్మ త‌త్వం వారికైనా ఎంతో అందాన్ని చేకూర్చుతుంది. 

 

ఇందుకు ముందుగా.. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, అర స్పూన్ గోధుమపిండి, చిటికెడు పసుపు, ఒక స్పూన్ పెరుగు వేసి పేస్ట్ గా తయారుచేసుకుని పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి బాగా అప్లై చేసి పావు గంట‌ తర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేస్‌ను శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖ ఛాయను పెంచటమే కాకుండా ముఖ రంద్రాలను కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంలో మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ ని ట్రై చేసి ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోండి. 

 

వాస్త‌వానికి శనగపిండి చర్మం మీద నలుపు, మృతకణాలను తొలగించటంలో బాగా సహాయపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా, మృదువుగా చేస్తుంది. ఇక గోధుమపిండి చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి మృదువుగా, కాంతివంతంగా చేయటానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే పసుపులో ఉండే పోషకాలు, యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంపై బ్యాక్టీరియాను తొలగించి ముఖాన్ని తాజాగా మారుస్తుంది. మ‌రియు మొటిమ‌ల‌ను త‌గ్గిస్తుంది. మ‌రియు  పెరుగు మన చర్మానికి అవసరమైన లాక్టిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అద్భుతమైన కాస్మెటిక్. పెరుగులో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని పోషకంగా మరియు తేమగా మారుస్తాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: