కొత్తిమీర‌.. దీని వాస‌నను ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. ఏ కూర‌లో అయినా కొత్తిమీర వేస్తే.. వ‌చ్చే రుచి అంతా ఇంతా కాదు. అందుకే కొత్తిమీర‌ను రుచికోసం ఆహార తయారీలలో ఎక్కువుగా ఉపయోగిస్తుంటారు. అయితే దాన్లో పోషకాలు పూర్తిగా అందాలంటే కూర వండిన తర్వాతే కొత్తిమీర దానిపై చల్లాలి. అంతే తప్ప కూర వండుతున్నప్పుడు కొత్తిమీరను అందులో వేస్తే.. ఆ ఆకులు అతి వేడికి ఉడికిపోయి... వాటిలో పోషకాలు ఆవిరి రూపంలో బయటకు పోతాయి. ఇలాంటి కొత్తిమీరను తింటేనే కాదండోయ్.. శరీరానికి పూసుకున్నా సరే ఆరోగ్యమే. జీర్ణక్రియకు తోడ్పడే కొత్తిమీరలో సౌందర్య గుణాలు ఎక్కువే. 

 

అయితే కొత్తిమీర‌ను ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా యూజ్ చేస్తే.. ఖ‌చ్చితంగా మీ అందం రెట్టింపు అవుతుంది. అందులో ముందుగా,  కొత్తిమీర పేస్టులో టీ స్పూన్‌ కలబంద గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పావుగంట‌ తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొత్తిమీరలోని విటమిన్‌ ఎ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. వాస్త‌వానికి వేసవిలో పెదవులు ఆరిపోతూ ఉంటాయి. వాటిని తడి చేస్తూ ఉండటం వల్ల పొడిగా మారి పొరలు ఏర్పడతాయి. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టాలంటే.. కొత్తిమీర పేస్టునులో కాస్త నిమ్మ రసం వేయండి. రెండిటినీ బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మీ పెదవులకు పూయండి. ఇలా రోజూ చేస్తుంటే.. మీ పెదాలు అందంగా మారిపోతాయి. 

 

అదేవిధంగా, టొమాటో మరియు కొత్తిమీర మాస్క్ పొడి మరియు జిడ్డు చర్మం ఉన్న వారి కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక స్ప్పోన్ కొత్తిమీర రసం, ఒక స్పూన్ టమోటో రసం, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మీ ముఖానికి పట్టించి పావు గంట‌ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేస్తే.. మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే చర్మంపై దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, గాట్లు, దెబ్బలు, గాయాలు, నీరు కారడం, ఉబ్బడం ఇలా ఏం జరిగినా... కొత్తిమీర తినేయాలి. అలా కొన్ని రోజులు తింటా ఉంటే.. చర్మం సంగతి అది చూసుకుంటుంది. ముఖ్యంగా పిల్లల చర్మ సంరక్షణలో కొత్తిమీర అత్యంత కీలకమైనది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: