నిమ్మ‌కాయ.. దీని గురించి తెలియ‌ని వారుండ‌రు. ఎందుకంటే.. న‌మ్మ‌కాయ ప్ర‌తిఇంట్లోనూ కామ‌న్ ఉంటుంది. ఇక మన శరీరం లో ప్రతి ఒక అవయవానికి ఉపయోగాపడే వస్తువు నిమ్మకాయ. అందుకే అంటారు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండేది నిమ్మకాయ‌ని. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు అధికం. నిమ్మరసం ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయక పానీయంగా భావిస్తారు. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు. అయితే ఇలాంటి నిమ్మ‌కాయ ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.. అందానికి కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

నిమ్మపండులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి తొలగించడానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల, మనం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా కనబడుటకు బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా నిమ్మకాయ ముఖానికి పట్టించటం వలన మంచి లాభాలు ఉన్నాయి. ఇందుకు ముందుగా.. నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి ఉదయం ఒక ముక్క, సాయంత్రం ఒక ముక్క ముఖానికి పట్టించి.. చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకుపోయిన మురికిన తొలిగించ‌డ‌మే కాకుండా.. మొటిమ‌లు, వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు కూడా త‌గ్గుతాయి.

 

మ‌రియు ముఖాన్ని అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డానికి కూడా ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ఈ టిప్ వారానికి రెండు సార్లు మాత్ర‌మే వాడాలి. అతిగా వాడితే మాత్రం అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాగే ఇందుకు ఫ్రెష్ నిమ్మకాయని మాత్ర‌మే వాడాలి. అంతేకాదు,  నిమ్మకాయకి బాక్టీరియాను ఆకర్శించే గుణం ఎక్కువగా ఉండటం వల్ల‌.. నిమ్మకాయను కోసి పక్కన పెట్టినప్పుడు అది చుట్టుపక్కల ఉన్న బాక్టీరియాను ఆక్షర్శించుకుంటుంది. అందుకే నిమ్మకాయను కోసిన తరువాత అర‌గంట‌ కంటే ఎక్కువ బయట ఉంచకూడదు, ఒకవేళ ఉంటె దానిని చ‌ర్మానికి అప్లై చేయ‌కూడ‌దు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: