సాధార‌ణంగా చాలా మంది మ‌హిళ‌లు తాము అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌నే తాపత్రయంతో తరుచూ మేకప్ వేసుకుంటూనే ఉంటారు. అస‌లు మేక‌ప్ లేకుండా ఇంటి నుంచి బయటకు రారు. క‌నీసం కొద్దిపాటి మేకప్ అయినా వేసుకుని బ‌య‌ట‌కు వెళ్తుంటారు. అందుకే మేకప్ అనేది మహిళల యొక్క బెస్ట్ ఫ్రెండ్. అయితే అతిగా వేసుకుంటే, ఫ్రెండ్ కూడా శత్రువుగా మారవచ్చు. వాస్త‌వానికి మేక‌ప్ వేసుకోవ‌డం వ‌ల్ల  దుష్ప్రభావాలు ఉన్నాయన్న సంగ‌తి తెలిసినా.. దాన్ని మాత్రం వ‌దిలి పెట్ట‌రు. ఆరోగ్యకరమైన మరియు అందమైన చర్మాన్ని పొందడానికి ఇలాంటి కృత్రిమ రసాయనాలవైపు మొగ్గు చూపడం అంత శ్రేయస్కరం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.

 

ఇదే క్ర‌మంలోనే స‌మ‌జ చిట్కాల‌తోనే మ‌నం అందంగా మెరిసిపోవ‌చ్చ‌ని అంటున్నారు. అలాంటి స‌హ‌జ సౌంద‌ర్య సాధ‌న‌ల్లో వాటిలో నిమ్మ‌కాయ కూడా ఒక‌టి. నిమ్మకాయ యొక్క సౌందర్య ప్రయోజనాలు అందరికీ తెలిసిన‌వే.  అయితే దీనిని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది మాత్రం తెలియ‌క‌పోవ‌చ్చు. వాస్త‌వానికి ఇది సిట్రస్ పండ్ల జాతికి చెందినందువలన, విటమిన్-సి ని విరివిగా కలిగి ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మాన్ని లోతుగా శుద్ది చేయడంలో మరియు చర్మరంధ్రాలలోని మృత కణాలను తొలగించి, చర్మరంద్రాలను తెరవడంలో సహాయపడుతుంది.

 

అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే కప్పు వేడినీళ్లల్లో నిమ్మరసం కలుపుకుని తాగుతుండాలి. ఈ నిమ్మరసం మలినాలను తొలగించి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫంగల్ వంటి ఖనిజాలు చర్మానికి మంచి తాజాదనాన్ని చేకూర్చుతాయి. దీంతో చ‌ర్మం అందంగా మెరిసేలా చేస్తుంది. మ‌రియు వేడినీళ్లల్లో నిమ్మరసం కలుపుకుని ప్ర‌తిరోజు తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా, కోమలంగా త‌యార‌వుతుంది. ముడ‌త‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. ఇక‌ పొడిబారిన చర్మంపై, మృతకణాలున్న పెదాలపై నిమ్మరసం రాస్తే చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే రాత్రి నిద్రించే ముందు పెదాలకు నిమ్మరసం రాసుకుని పడుకుంటే పేదలు అందంగా ఆరోగ్యంగా తయారవుతాయి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: