మనం అనుకుంటాం మేకప్ వేస్తేనే అందంగా కనిపిస్తాం అని. కానీ నిజానికి ఎటువంటి మేకప్ లేకపోయినా సహజసిద్ధమైన కాయగూరలు, పండ్లతోనే అందంగా మారిపోవచ్చు. అలా మార్చేగుణం కొత్తిమీరలో కూడా ఉంది అని మీకు తెలుసా? కేవలం అంటే కేవలం మూడు లేదా నాలుగు టిప్స్ తో కొత్తిమీరతో అందంగా మెరిసిపోవచ్చు.. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి అందంగా మారిపోండి. 

 

IHG

 

వేసవిలో పెదవులు ఆరిపోతూ ఉంటాయి.. అలాంటి సమయంలో మృతకణాలు ఏర్పడకుండా కొత్తిమీర పేస్టును పెదాలకు రాస్తే  మంచిగా మారుతాయి. కొత్తిమీర పేస్ట్ లో కాస్త నిమ్మరసం వేసి పట్టిస్తే పెదాలు మృదువుగా అందంగా మారిపోతయ్. 

 

IHG

 

వయసు వచ్చే కొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో ముడతలు బాగా ఇబ్బంది పెడుతాయి. అయితే కొత్తిమీరను పేస్ట్ లా చేసి అందులో కాస్త అలోవెరా గుజ్జుని పట్టించి 15 నిమిషాలు పాటిస్తే చర్మంపై ముడతలు పడకుండా తాజాగా కనిపిస్తాయి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. 

 

IHG

 

చర్మంపై మృతకణాలు వయస్సును అమాంతం పెంచేస్తాయి. ముఖాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. అలాంటి సమస్య గట్టెక్కాలంటే.. దనియాల పొడిలో కాస్త నీటిని కలిపి పేస్టులా చేసుకోని అందులో కొన్ని ఓట్స్, గుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పూసుకొని కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.                        

మరింత సమాచారం తెలుసుకోండి: