అందమైన మెరిసే చర్మం కావాలని అంద‌రూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆడ‌వారు అందంగా క‌నిపించ‌డానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అటువంటి మగువలకు వేసవిలో కాస్ట కష్టమే. భానుడి కిరణాలు వారి అందాన్ని మసిబారుస్తుంటాయి. ఈసరిస్థితుల్లో చర్మ, ముఖ  సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కాని, అనుకోని విధంగా వచ్చిన ఓ మొటిమో.. లేక పొడిబారిన, నల్లబడిన చర్మమో.. ఇలా అందానికి అడ్డంకిగా ఏదో ఒక సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయిటే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు ఐస్ క్యూబ్స్‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. 

 

అందుకు ముందుగా.. ఓ బౌల్‌లో ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ వేసి ముఖం అందులో ప‌ది సెకన్ల చొప్పున, రెండు, మూడు సార్లు పెడుతుండాలి. ఇలా చేయడం వల్ల మొటిమ‌ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. లేదా ఓ ఐస్ క్యూబ్‌ని తీసుకుని మొటిమలపై పెట్టాలి. మరి ఇబ్బందిగా అనిపిస్తే ఓ క్లాత్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టి దానితో మొటిమలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. ఇక కొందరు ఎక్కువ సమయం నిద్రపోయినా, లేదంటే రకరకాల కారణాల వల్ల కళ్లు ఉబ్బిపోతాయి. అలాంటి వారు ఐసుముక్కల్ని జిప్‌లాక్‌ బ్యాగుల్లో ఉంచి కళ్ల మీద పెట్టుకోవాలి. కళ్లకు హాయిగా అనిపించ‌డ‌మే కాకుండా.. అలర్జీలు కూడా దూరమవుతాయి.  

 

అదేవిధంగా, మేకప్‌ వేసుకునే ముందు ఐస్‌ ముక్కను ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత క్రీమును రాసుకుంటే అది చర్మం పైన బిగుతుగా అవుతుంది. దీనితో అక్కడి కణాలన్నీ ఉత్తేజితమవుతాయి. వయసు పెరిగేకొద్దీ ముఖంలో ముడతలు మొదలవుతాయి. అప్పుడప్పుడు ఐసు ముక్కల్ని ముడతలున్న చోట మర్దన చేసుకుంటే చాలు. అవి అదుపులో ఉండటమే కాదు చర్మం కూడా మృదువుగా మారుతుంది. అలాగే మురికీ, కాలుష్యం కారణంగా ముఖం జిడ్డుగా కనిపిస్తుంటుంది. అలాంట‌ప్పుడు ఐసుముకల్ని మర్దన చేయ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: