నెయిల్ పాలిష్.. దీనిని అమ్మాయిలు ఎంత‌గా ఇష్ట‌ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నెయిల్ పాలిష్ ఆడ‌వారి గోర్లకి మరింత అందాన్నిచ్చే ఓ కాస్మొటిక్ ప్రొడక్ట్. సాధార‌ణంగా ఇదివరకటి రోజుల్లో ఏ పెళ్లికో, వేరే ఏదైనా శుభాకార్యాల కోసమో అందంగా క‌నిపించ‌డానికి ఆడ‌వారు నెయిల్ పాలిష్ వేసుకునేవారు. కానీ కాలంతో పాటు ట్రెండ్ కూడా మారింది. గోళ్లరంగు వేసుకోవడానికి ప్రత్యేకంగా సందర్భం ఏమీ అక్కర్లేదని నిరూపిస్తున్నారు. ప్ర‌తి రోజు  డ్రస్సుకు మ్యాచ్ అయ్యేలా పాత నెయిల్ పాలిష్‌ని రిమూవ్ చేసి కొత్తది వేసుకుంటున్నారు.

 

 కానీ నెయిల్‌ పాలిష్‌ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్థారించారు. వాస్త‌వానికి నెయిల్ పాలీష్ చిక్కగా ఉండి, త్వరగా గట్టిపడటానికి వాటిల్లో ఫార్మాల్డిహైడ్ ఖ‌చ్చితంగా వాడతారు. అయితే వీటిని ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ వరసగా వేసుకుంటుంటే ఈ రసాయనాలు గోరులో పేరుకుపోయి.. కొంత కాలానికి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీనివల్ల గోరుచుట్లు, గోరుపైని చర్మం వాచి నొప్పి, చీముకూడా పట్టొచ్చు. గోరు రూపమే మారిపోవచ్చు. అలాగే దాదాపు సగం కంపెనీలు నెయిల్‌ పాలీష్ ఎక్కువ కాలం ఉండేందుకు ట్రైఫెనైల్‌ ఫాస్పేట్‌ అనే రసాయనం వాడుతున్నారు.

 

ట్రైఫెనైల్‌ ఫాస్పేట్‌ రసాయనం మానవ శరీరంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ముఖ్యంగా ట్రైఫెనైల్‌ ఫాస్పేట్‌ ఎక్కువగా ఉండే నెయిల్‌ పాలిష్‌లను వాడటం వల్ల మనిషి శరీరంలోని హార్మోన్‌లు ప్రభావితం అవుతాయట. అలాగే దీని వాసన ప్రతి రోజు చూసే వారు మెల్ల మెల్లగా బరువు పెరుగుతారని, మరీ ఎక్కువగా వాడితే మాత్రం బరువు మరీ ఎక్కువ పెరుగుతారని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ఇక కొన్నిసార్లు ఆడపిల్లలు క్లాసుల్లో లేదా ఖాళీ స‌మ‌యంలో బుగ్గన చెయ్యిపెట్టుకుని కూర్చుంటారు. అప్పుడు గోళ్ల రంగులోని రసాయనాలు చాలాసేపు చెంపలకు అంటుకుంటాయి. వాళ్లు బయట ఎండలోకి వచ్చినప్పుడు అవి సూర్యరశ్మితో చర్య జరిపి.. చెంపల మీద అలర్జీ రియాక్షన్లకు కారణమవుతుంటాయి. కాబట్టి బీకేర్‌ఫుల్..!!

  

మరింత సమాచారం తెలుసుకోండి: