అందంగా క‌నిపించాల‌ని అంద‌రూ తెగ ఆరాట‌ప‌డుతుంటారు. కానీ, అదే స‌మ‌యంలో ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌లు వేధిస్తుంటాయి. పొడి చర్మం, మోటిమలు లేదా మచ్చలు, పిగ్మెంటేషన్ మొదలైన కొన్ని సాధారణ సమస్యలు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. దీంతో ఈ సమస్యలను వెంట‌నే పరిష్కరిస్తాయని భావించి.. వేల‌వేల‌కు ఖ‌ర్చు చేస్తుంటారు. కానీ, త‌గిన ఫ‌లితం లేక బాధ‌ప‌డుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సింపుల్ అండ్ హొమ్‌మేడ్ టిప్స్ ఫాలో అయితే వారం రోజుల్లోనే మెరిసే స్కిన్ సొంతం చేసుకోవ‌చ్చు.

 

అందులో ముందుగా.. శనగపిండి, కొద్దిగా పసుపు మ‌రియు అప్పుడే తయారు చేసిన గ్రీన్ టీ మూడు బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. అప్లై చేసిన అర గంట త‌ర్వాత‌ చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి, రెండు సార్లు చేస్తే ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు తొలిగించ‌డంతో పాటు ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అలాగే ఒక టీ స్పూన్ టమోటా రసం, నిమ్మరసం కలిపి ఫేస్‌కు అప్లై చేయాలి. అర గంట‌ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకుపోయిన మురికిని పోగొట్ట‌డంతో పాటు నల్లటి వలయాలను తొల‌గిపోతాయి.

 

ఇక ఎప్పుడూ మీ స్కిన్ మెరుస్తూ ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి. అర కప్పు కాఫీ పొడి లో కొంచెం పాలు పోసి పేస్ట్ చెయ్యండి. దీన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరవాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. అదేవిధంగా, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో కొద్దిగా.. గ్రీన్ టీ, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయ‌డం. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. అర గంట పాటు అలాగే వదిలేసి.. ఆ త‌ర్వాత‌ చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తే.. మొటిమ‌లు త‌గ్గ‌డంతో పాటు మంచి క‌ల‌ర్ సొంతం చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: