అందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రమే కొన్ని బ్యూటీ టిప్స్ పాటించి అందాన్ని రెట్టింపు చేసుకుంటుంటారు. ఎందుకంటే అందంగా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కాబట్టి. ఇంకా అలాంటి అందం పెంచే చిట్కాలు ఎన్నో ఉన్నాయ్. ముందుగా బ్లాక్ హెడ్స్ ని తగ్గించి అందంగా కనిపించండి.                

IHG

 

ఎండలోనూ, బయట తిరిగినప్పుడు ముఖం మీద దూళి కణాలు చేరి అవి కాస్త బ్లాక్ హెడ్స్ గా ఏర్పడుతాయి. మొటిమలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ వంటి చర్మ సమస్యలు ఉన్నవారికి చర్మం జిడ్డుగా మారుతుంది. అయితే అలాంటి చిన్ని చిన్ని సమస్యలకు ఇంట్లో లభించే కొన్ని వస్తువులను ఉపయోగించి మొటిమలు తగ్గించుకుంటే సరిపోతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

IHG

 

బ్లాక్ హెడ్స్ ని పోగొట్టేందుకు కావాల్సిన పదార్ధాలు.. అరటిపండు, తేనే, ఓట్స్ కావాలి. ఇంకా ఇవి మూడు బాగా మెత్తగా పేస్ట్ లా కలిపి ఆ పేస్ట్ ని ముఖంపై మచ్చలు ఉన్న  చోటా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి 5 నుండి 7 నిమిషాల పాటు అలాగే ఉంచితే బ్లాక్ హెడ్స్ తొలిగిపోయి అందంగా తయారవుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని సంరక్షించుకోండి. అందంగా కనిపించండి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: