అందం ప్రతి ఒక్కరికి అవసరం. అందంగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే వయసు పెరిగే కొద్దీ చర్మంపై మార్పులు ఏర్పడుతాయి. అయితే ఆ ముడతలను ఏ అమ్మాయి కావాలనుకోదు. అందుకే ఆ ముడతలు కనిపించకుండా రాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. 

 

ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఒత్తిళ్లకు గురి కాకుండా పని నెమ్మది చేసుకుంటూ పోతారు. అయినా సరే చర్మంపై ముడతలు, మొటిమలు వంటివి వస్తాయి. అయితే చిన్న వయసులోనే చర్మంపై మార్పులు రాకుండా తగిన జాగ్రత్తలు ఇలా తీసుకొండి అందంగా తయారవ్వండి. 

 

అందమైన స్కిన్ కోసం.. 

 

కెమికల్స్ ఉన్న క్రీమ్స్ వాడటం మానేసి మంచి ఆహారం తీసుకోండి. ఆరోగ్యవంతమైన చర్మం సొంతం చేసుకోండి అందంగా కనిపించండి. 

 

అందమైన చర్మం కోసం పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. ఇవి మైండ్ రిఫ్రెష్ చెయ్యడమే కాకుండ శరీరాన్ని బలంగా తయారు చేస్తుంది. 

 

సన్ స్క్రీన్ లోషన్‌తో అందం మీ సొంతం.. 

 

చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ ఎంతో ముఖ్యం. బయటకు వచ్చినప్పుడు ఈ సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగిస్తే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. బయటికి వెళ్ళడానికి 15 నిమిషాల ముందు ఈ సన్ స్క్రీన్ లోషన్ ను రాసుకోవాలి. 

 

హైడ్రేషన్..

 

చర్మాన్ని హైడ్రేషన్‌‌‌గా ఉంచటం చాలా మంచిది. నీళ్లు ఎక్కువగా తాగితే అందంగా తయారవుతుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.  

 

మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా హానికరం. అందుకే మీ చర్మం అందంగా తయారవ్వాలి అంటే ముందు ఈ అలవాట్లకు దూరం అవ్వండి. 

 

చర్మ ఆరోగ్యానికి మంచి నిద్ర ఎంతైనా అవసరం. రోజు 8 గంటలకు పైనే నిద్రపోవాలి.. అప్పుడు చర్మం ఆరోగ్యంగా అందంగా తయారవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: