అందం.. ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలి అని ఉంటుంది. కానీ కొందరు మాత్రం చిన్న వయసులోనే పెద్ద వాళ్ళుల కనిపించేస్తారు. దీనికి కారణంగా వారి చర్మం ముడతలు పడటం మెల్లగా మొదలవుతుంది. దీని వల్ల మన చర్మ కాంతి కూడా కోల్పోవటం మొదలవుతుంది. అయితే ఈ సమస్యకు కొన్ని చిట్కాలు పాటిస్తే నడివయసులోను మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. 

 

అమ్మాయిలు ప్రతి రోజు కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. దీని వాళ్ళ డీహైడ్రేషన్ ముప్పు ఉండదు.. నీరు ఎక్కువ తీసుకున్నందు వల్ల అలసట పోయి వయసుపై ప్రభావం చూపించదు. 

 

ఓ గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో మలినాలు వదిలి చర్మాన్ని కాంతివంతంగా తయారవుతాయి. 

 

ఆహారంలో తగినన్ని కార్బోహైడ్రేడ్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ ఆసిడ్లు వంటివి అందేలా చూసుకోవాలి. 

 

దీనికి రోజు వారి ఆహారంలో మాంసం, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులు, తృణ ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. 

 

చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండేందుకే విటమిన్‌ డి ముఖ్యం. రోజుకు కనీసం అరగంట పాటైనా ఎండ తగలాలి. అప్పుడే చర్మానికి విటమిన్ డి లభిస్తుంది. 

 

రోజుకు మనం తక్కువే పని చేసుకోవాలి.. ఎక్కువగా అలిసిపోతే వయసును వేగంగా ఆహ్వానించడమే. అందుకే తగిన విశ్రాంతి తీసుకొని పని చెయ్యాలి. 

 

వారానికి ఒకసారి గోరువెచ్చని సుగంధ నూనె తో శిరస్సు నుంచి అరికాళ్ల వరకు మర్దన చేయించుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడి వయసు ప్రభావం పడదు. 

 

వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల వయసు మీద పడకుండా ఉంటుంది. 

 

ధూమపానం, మద్యపానం చర్మన్నీ దెబ్బతీస్తాయి.. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

 

ఇవి అండి.. ఆరోగ్యంగా.. ఆనందగా.. అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి కావాల్సిన చిట్కాలు ఇవే. 

మరింత సమాచారం తెలుసుకోండి: