పువ్వులనుండి తేనెటీగలు సేకరించే తియ్యటి ద్రవ పదార్థ‌మే తేనె. ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. ఇక‌ స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తేనె.. చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. తేనె చర్మానికి మంచి గ్లోను తీసుకురావడంతో పాటు, చర్మంలోని మచ్చలు మరియు చారలు వంట వాటిని రూపు మాపడంలో అద్భుతంగా సహాయపడుతుంది. 

 

ఇక‌ కాలంలోనైనా తేనె అనేది సౌందర్యపోషణకు ఒక సాధనంగా పనిచేస్తుంది. అయితే దీనిని స‌రైన పద్ధతిలో ఎలా ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఆ విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా.. అర టీస్పూన్‌ తేనెలో, టీస్పూన్‌ రోజ్‌వాటర్‌, టీస్పూన్‌ పాలపొడి వేసి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రుద్దుకోవాలి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం ముఖానికి తేమ అందుతుంది మ‌రియు చర్మం తాజాగా కూడా కనిపిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా తేనెను ముఖానికి రాసుకుని ప‌ది నిమిషాల త‌ర్వాత నీటితో క్లిన్ చేసుకోవాలి. 

 

ఇలా చేయ‌డం వ‌ల్ల తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ముఖంపై ఉన్న మచ్చలను తొలగిస్తుంది. తేనె ఒక అద్భుతమైన హైడ్రేటింగ్ ఏజెంట్. ఇది చర్మంను హెల్తీగా ఉంచుతుంది. అదేవిధంగా, వేసవిలో తేనెను యూజ్ చేయ‌డం ఎక్సలెంట్ రెమెడీ. ఇది ఎండ వల్ల చర్మం పాడవకుండా, స్కిన్ టానింగ్ కు గురి కాకుండా నివారిస్తుంది. మ‌రియు హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఇందుకోసం కొద్దిగా తేనె మ‌రియు పాలు క‌లిసి ముఖానికి అప్లై చేయాలి. బాగా ఆరిన త‌ర్వాత చల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమలు కూడా త‌గ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: