సగ్గుబియ్యం.. వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సగ్గుబియ్యంను పాయంసంగా, ఉప్మాగా ఇలా అనేక ర‌కాల వంట‌లు తయారు చేసుకుని తింటారు. వండక ముందు తెల్లగా వండిన తరువాత పారదర్శకంగా ఉంటాయి సగ్గుబియ్యం. ఇందులో శరీరానికి కావాల్సిన ఖనిజాలన్నీ ఉన్నాయి. ఇక నీరసంగా ఉండేవారు, ఆరోగ్య సమస్యలున్న ఉన్నవారు సగ్గుబియ్యం జావ తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అలాగే విరేచనాలు, పొట్ట ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం, ఎసిడిటీ... ఇలా జీర్ణాశయానికి సంబంధించి ఎలాంటి సమస్యకైనా సగ్గుబియ్యం దవ్యౌషధంగా పనిచేస్తుంది. 

IHG

అంతేకాదు, సగ్గుబియ్యం డైట్ లో చేర్చుకుంటే.. రోజంతా గడిచినా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఎందుకంటే.. ఇందులో కార్బొహైడ్రేట్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి.  రక్తపోటుని నియంత్రించడంలో, ఎముకలని దృఢంగా ఉంచడంలో, కండరాలకి శక్తిని అందించడంలో స‌గ్గుబియ్యంకు సాటిలేదు. అయితే స‌గ్గుబియ్యం ఆరోగ్య ప‌రంగానే కాకుండా సౌంద‌ర్య‌ప‌రంగానూ ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌నుకునేవారు స‌గ్గుబియ్యంను ట్రై చేస్తే మంచి ఫ‌లితం పొందొచ్చు.

IHG

అందుకు ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ స‌గ్గుబియ్యం పొడిలో కొద్దిగా పాలు పోసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు బాగా ప‌ట్టించాలి. ఒక అర గంట పాటు అలానే వ‌దిలేసి.. ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లిన్ చేసుకోవాలి. ఇలా వారినిక మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.. ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి.. చ‌ర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతేకాకుండా..  ముఖంపై ఉన్న మచ్చలూ, మడతలూ కూడా తొలగిపోతాయి. ఇక ఆ స‌గ్గుబియ్యం పిండి ఆలివ్‌ నూనెతో కలిపి జుట్టుకి పట్టిస్తే... వెంట్రుకల ఎదుగుదల అద్భుతంగా ఉంటుంద‌ట‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: