చర్మ సమస్యలు.. ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఏదో ఒక టైమ్‌లో ఇవి ఎదుర‌వుతుంటాయి. పొడి చర్మం, మోటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్, డ్రై స్కిన్‌ మొదలైన కొన్ని చ‌ర్మ‌ సమస్యలు ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారు. ఇక ఇవి త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ ప‌డే పాట్లు అన్నీ కావు. ఈ క్ర‌మంలోనే మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నించి ఫ‌లితం లేక నిరాశ‌ప‌డ‌తారు. అయితే వాస్త‌వానికి వీటిలో ఏ ఉత్పత్తి సహజమైనది, సురక్షితమైనది కావు. అందుకే వీటి వ‌ల్ల శాశ్వ‌త పరిష్కారం ల‌భించ‌క‌పోగా.. ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను పెంచుతాయి.

 

కాబ‌ట్టి, స‌హ‌‌జ ప‌ద్థ‌తుల‌ను ఎంచుకోవ‌డం మంచిదంటున్నారు సౌంద‌ర్య నిపుణులు. అలాంటి స‌హ‌జ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో బియ్యం పిండి కూడా ఒక‌టి. బియ్యం పిండి.. ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉంది. వాస్త‌వానికి బియ్యం పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. దాంతో పాటు చర్మ కాంతిని పెంచుతుంది. ఎందుకంటే.. ఇందులో చర్మంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుణంతో పాటు, చర్మంను సాఫ్ట్ గా మరియు యూత్ ఫుల్ గా కనబడేందుకు తేమను పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. బియ్యం పిండి చ‌ర్మానికి వాడ‌డం వ‌ల్ల ఇత‌ర క్రీమ్స్ వాడ‌క్క‌ర్లేదు.

 

మ‌రి ఈ ప్ర‌యోజ‌నాలు అన్ని పొందాలంటే ఇప్ప‌డు చెప్ప‌బోయే సింపుల్ టిప్ ఫాలో అవ్వండి. ఇందుకు ముందు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల‌ బియ్యం పిండి, ఒక టీ స్పూన్‌ నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ మ‌రియు చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించా అర గంట పాటు అలా వ‌దిలేసి.. అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం కొత్త కాంతిని సంత‌రించుకుంటుంది. మ‌రియు ముఖంపై ఉన్న మొటిమ‌లు, వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు తొలిగిపోతాయి.

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: