ప‌సుపు.. ఇది ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో ప‌సుపుకు అధికమైన ప్రాధన్యత ఉంది. ఇక ప‌సుపును పూజా సంబంధిత కార్యాల్లోనే కాకుండా వంటకాల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పసుపు కేవలం వంటకానికి రంగు, రుచి తెచ్చేది మాత్రమే కాకుండా.. బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా చేకూరుస్తుంది. అంతేకాదు, చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ ప‌సుపు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మ‌రి ప‌సుపును చ‌ర్మానికి ఎలా ఉప‌యోగిస్తే.. మంచి ఫ‌లితాలు పొందొచ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

అందుకు ముందుగా పాలల్లో పసుపు కలుపుకోని ముఖానికి అప్లై చేసుకోవాలి. బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఎండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖ ఛాయ మెరుస్తుంది. అలాగే ముఖంపై వచ్చే మొటిమలను నివారించటానికి చర్మన్ని కాంతివంతంగా మార్చటానికి పసుపు చాలా ఉపయోగపడుతుంది. ఇక సూర్యరశ్మి ప్రభావం వల్ల స్కిన్ పై ట్యాన్ పెరగం స‌హ‌జ‌మే. దీంతో చాలామంది దీని నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్లో దొరికే ర‌క‌ర‌కాల ట్యాన్ ప్యాక్ లు ఉపయోగిస్తుంటారు. 

 

కానీ, ప‌సుపు చర్మంపై ఉన్న ట్యాన్ ను సమర్థంగా పోగొడుతుంది. ఇందుకు పసుపు, చందనం, నిమ్మరసం మూడు క‌లిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ముఖానికి అప్లై చేసి.. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే పసుపులో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నందున ఇది చర్మం పై పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని కోసం కొద్దిగా ప‌సుపు మ‌రియు రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి.. ముఖాననికి అప్లై చేసుకోవాలి. ఒక పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టినీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం పొందొచ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం పై ఉన్న మచ్చలు, మోటిమలను పోగొట్టి.. ఎంతో కాంతివంతంగా కూడా చేస్తుంది.
 
  
  

మరింత సమాచారం తెలుసుకోండి: