ప్రతి మహిళలో ఈ జుట్టు రాలడం సమస్య ఉంటుంది. ఈ జుట్టు రాలడం తగ్గాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏలాంటి ఉపయోగం ఉండదు. అయితే మనం ఉపయోగించే షాంపులలో, ఆయిల్ లో లోపాలు ఉంటాయి. ఆ లోపాల కారణంగానే జుట్టు దారుణంగా రాలిపోతుంది. 

 

అంతేకాదు మనం తీసుకునే ఆహారం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. చుండ్రు ఈ సమస్యకు ఉన్న మరో ప్రధాన కారణం. అయితే కారణాలు ఏమైనప్పటికి కింది చిట్కాలు పాటిస్తే జుట్టు రాలే సమస్య దాదాపు తగ్గిపోతుంది. అంతేకాదు ఆ జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవచ్చు కూడా.. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ కింద ఉన్న చిట్కాలు పాటించి మీ జుట్టును జాగ్రత్తగా కాపాడుకొండి. 

 

బాదాం, ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో వారానికి రెండు సార్లు అయినా తలకి పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల జుట్టు పొడిబారకుండా నిర్జీవంగా మారకుండా రాలకుండా ఉంటుంది. 

 

ఒక గిన్నెలో 6 చెంచాల నూనె, అరా చెంచా మెంతులు తీసుకొని సన్నటి మంట మీద 5 నిమిషాలు ఉంచి ఆరనిచ్చి, ఆ గోరువెచ్చని నూనెను మునివేళ్ళతో మాడుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ జుట్టు రాలటం ఆగి, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 

 

ఇంకా తీసుకునే ఆహారంలో ఐరన్ తగ్గినా జుట్టు రాలుతుంది కాబాట్టి తరచూ ఎండబెట్టిన అత్తిపండు, జీడిపప్పు, బాదం పప్పులతో బాటు లివర్ మరియు రొయ్యలు తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల తగినంత ఐరన్ అంది జుట్టు రాలటం తగ్గుతుంది.

 

వారానికి రెండు సార్లైనా మంచి కండీషనర్ తో తలస్నానం చేయడం మంచిది. దీని వల్ల దుమ్ము, ధూళి తొలగిపోయి చుండ్రు చేరదు. 

 

రోజుకు ఒక గ్లాసు తాజా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కూడా జుట్టు రాలటం బాగా తగ్గుతుంది.

 

జుట్టు స్వభావానికి తగిన షాంపూను ఉపయీగించడం మంచిది. దీని వల్ల జుట్టు రాలటం వంటి సమస్య ఉండదు.

 

చూశారుగా ఈ చిట్కాలు పాటించి మీ అందమైన జుట్టును ఈ చిట్కాలు పాటించి మరింత అందంగా తయారు చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: