ద్రాక్ష.. మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఆ ద్రాక్షతో కేవలం శరీర ఆరోగ్యమే కాదు అందం కూడా మీ సొంతం అవుతుంది. అవును మీరు విన్నది నిజం.. ద్రాక్ష వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి. ద్రాక్షతో అందం ఎలా సొంతం అవుతుంది అన్నది ఇక్కడ ఉన్న చిట్కాలు చదివి తెలుసుకోండి.. అందంగా మారండి. 

 

IHG

 

కొంత ద్రాక్ష తీసుకొని పేస్ట్ లా తయారు చేసి అందులో కాస్త తేనే కలిపి ఆ గుజ్జును ముఖానికీ మెడకీ బాగా పట్టించాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే చర్మం మీద పేరుకున్న మురికి, జిడ్డు పోయి చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది.

 

పొడి చర్మంతో బాధపడే వారు చెంచా చొప్పున గుడ్డు తెల్లసొన, ద్రాక్ష పండ్ల రసాన్ని కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మంచి ఫలితం లభిస్తుంది. 

 

IHG's some tips for you | Grape farming ...

 

కళ్ల దగ్గర నల్లని వలయాలు, ముడుతలు ఉన్నవారు ద్రాక్ష పండును అడ్డంగా కోసి దానితో కంటికింది ముడతలు, వలయాల మీద 3 నిమిషాలు రుద్ది ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చెయ్యడం వల్ల కంటికింది చర్మం పలుచబడి ముడుతలు, మచ్చలు మాయం అయ్యి అందంగా తయారవుతారు. 

 

3 చెంచాల ద్రాక్షరసం, 5 చెంచాల పెరుగు, చెంచా నారింజ రసం కలిపి ముఖాన్నీ పట్టించాలి ఈ చిట్కా వయసు ప్రభావం చర్మంపై కనిపించకుండా చేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

 

IHG

 

కాస్త ద్రాక్ష తీసుకోని పేస్ట్ లా తయారు చేసి అందులో కాస్త గోధుమ పిండి, చిటికెడు బేకింగ్‌ సోడా కలిపి మొటిమలు కానీ మచ్చలు కానీ ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మచ్చలు, మొటిమలు మాయం అయ్యి చర్మం కాంతివంతగా తయారవుతుంది. 

 

ఈ చిట్కాలు పాటిస్తే మీ చర్మం కాంతివంతగా, యవ్వనంగా కనిపిస్తారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా తయారుచేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: