అర‌టిపండు ఆరోగ్యానికి ఎంత‌గా మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సంవత్సరం పొడవునా దొరికే అరటి పండు పోషకాల పవర్ హెన్ అంటారు ఆరోగ్య నిపుణులు. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అరటిపండు ఒకటి అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాల్లో అరటి సాగు జరుగుతుందంటే అతిశ‌యోక్తి కాదు. ప్రతిరోజు రోజు ఒక‌టి లేదా రెండు అర‌టిపండ్లు తీసుకుంటే.. మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చు. అయితే అర‌టిపండు కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.. చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

చర్మానికి, శిరోజాలకు అంతులేని మేలు చేస్తుంది అర‌టిపండు. ఈ పండులో ఉండే సి,బి6 చర్మం మృదువుగా చక్కని ఎలాస్టిక్ కలిగి ఉండేలా సహకరిస్తుంది. ఏ సీజన్ అయినా ముఖానికి అర‌టిపండు వాడితే.. చ‌ర్మాన్ని పొడిబారనివ్వకుండా చేస్తోంది. మ‌రి అర‌టిపండు చ‌ర్మానికి ఎలా వాడితే.. ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా అరటిపండుగుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో ఆయిల్ నెస్ కంట్రోల్ అవుతుంది. మొటిమ‌లు, వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌ల‌ను త‌గ్గిస్తుంది.

 

అలాగే అరటిపండును పేస్ట్ చేసి.. అందులో కొద్దిగాపంచదార కలిపి ఆ మిశ్రమంతో ముఖంపై నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఈ న్యాచురల్‌ స్క్రబ్‌ చర్మంపైన మృతకణాలను తొలగిస్తుంది. అదే స‌మ‌యంలో ముఖం కాంతివంతంగా మారుతుంది. అదేవిధంగా, అరటిపండు పేస్ట్‌కి ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అర గంట‌ పాటు ఆరనిచ్చి.. అనంత‌రం  చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. మ‌రియు అరటిపండు గుజ్జుని కళ్ల చుట్టూ రాసుకొని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో క్లీన్ చేసుకుంటే.. కంటి చుట్టు ఏర్పడే నల్లటి వలయాలు తగ్గిపోయి,

మరింత సమాచారం తెలుసుకోండి: