చాక్లెట్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు చాలా అరుదుగా ఉంటారు. దాదాపు అందరు చాక్లెట్ అంటే ఇష్టపడతారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ఆరోగ్యం మెరుగుపరచడానికి మరియు గుండె సంబంధిత వ్యాధులను ప్రమాదం నుండి తగ్గించడానికి ఎంత‌గానో సహాయపడుతుంది. ఇక మతిమరుపును దూరం చేసుకోవాలనుకుంటే రోజూ చాక్లెట్లు తప్పనిసరిగా తీనాలని వైద్యులు సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్ మరియు మరికొన్ని ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. 

IHG

డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వయసు మీద పడుతున్న సమయంలో కనిపించే లక్షణాలను ఇవి నియంత్రించి యవ్వనంగా కనిపించేలా చేయగలవు. అయితే చాక్లెట్స్ కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.. చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌రి చాక్లెట్‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఓ డార్క్ చాక్లెట్ చేసుకుని మెల్ట్ చేయండి. అనంత‌రం మెల్ట్ చేసిన చాక్లెట్‌కు కొద్దిగా ఆలివ్ ఆయిల్ మ‌రియు ఎగ్ వైట్‌ను వేసి మిక్స్ చేయండి.

IHG

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేయండి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే.. ముకం కాంతివంతంగా మారుతుంది. మ‌రియు చ‌ర్మాన్ని మృదువుగా, తేమ‌గా ఉంచుతుంది. మ‌చ్చ‌లు, మొటిమ‌ల‌ను త‌గ్గిస్తుంది. అలాగే చాక్లెట్ మీ చ‌ర్మాన్ని ఎండ బారి నుంచి.. ఎండ వ‌ల్ల క‌లిగే డ్యామేజ్ నుంచి ర‌క్షిస్తుంది. చాక్లెట్‌లో యాంటీఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలుంటాయి. ఇవి మన చ‌ర్మంలో తేమ‌ను పెంచుతాయి. అందుకే చాక్లెట్‌ని తిన‌డంతో పాటు.. ఫేస్‌ప్యాక్‌లో భాగంగా అప్లై చేసుకుంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొందే వీలుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: