మనం అందంగా ఉండాలి అంటే మనం ఎంతో శ్రద్ద తీసుకోవాలి. శ్రద్ద తీసుకుంటేనే అందంగా కనిపిస్తాం. అయితే అందంగా కనిపించేందుకు ఆర్టిఫిసియల్ ఉత్పత్తులు ఉపయోగించే కంటే కూడా మంచి సహజ ఉత్పత్తులు ఉపయోగించాలి. అప్పుడే అందంగా కనిపిస్తాం.. ఆరోగ్యంగా ఉంటాము. 

 

IHG

 

ఇంకా జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని సహజమైన చిట్కాలు పాటించాలి. అందులో జుట్టుకు ఎంతో అందాన్ని ఇచ్చే చిట్కా కర్వేపాకు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకు ప్రధానంగా కళ్ళకు మంచిది. కరివేపకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందంలో కూడా కీలక పాత్ర పోషించి కురుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

 

IHG

 

జుట్టు నెరవకుండా చూసుకుంటుంది. కురుల అందానికి కరివేపాకు ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. కొబ్బరినూనెలో కొన్ని కరివేప ఆకులను వేసి మరిగించి, చల్లారనివ్వాలి. ఇంకా ఆ నూనెను జుట్టుకుదుళ్లకు పట్టించి, మసాజ్‌చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. 

 

IHG

 

కప్పు కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతిపిండి కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి ఇలా చేస్తే 2 నెల్లల్లో తెల్లజుట్టు నలుపు అవుతుంది. కరివేపాకు, గింజ తీసిన పచ్చి ఉసిరికాయ, మందార పువ్వుల్ని గుప్పెడు చొప్పున తీసుకొని 2 చెంచాల నీరు చల్లి రుబ్బుకొని ఆ గుజ్జును తలకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది. ఈ చిట్కాలు పాటించి మీ జుట్టును అందంగా మార్చుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: