జీలకర్ర.. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ జీల‌క‌ర్ర కామ‌న్‌గా ఉంటుంది. ఎందుకంటే వంట ఇంట్లో వాడుకునే పోపు దినుసులలో జీల‌క‌ర్ర కూడా ఒకటి. అలాగే ప్రపంచ సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్ధానం వుంది. ప్రాచీన కాలము నుండీ ఇది వాడుకలో ఉంది . ప్రాచీన కాలంలోఈజిప్టు దేశంలో జీలకర్రను మమ్మీలను తయారు చేయటంలో ఒకపదార్ధంగా వాడేవారు. ఇక కూరల్లో రుచి పెంచడానికి వేసే జీల‌క‌ర్ర వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. 

 

రోజువారీ ఆహారంలో జీలకర్ర తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయి. ఫ‌లితంగా మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే జీలకర్ర యాంటీ సెప్టిక్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జలుబు కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే జీలకర్రను మ‌న డైలీ డైట్‌లో చేర్చుకుంటే వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. అయితే జీల‌క‌ర్ర కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.. చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజూ ఉదయాన్నే పరిగడుపున జీలకర్ర నీళ్లు తాగడం మ‌రియు వాటితో ముఖం కడుక్కోవడం చేస్తుంటే మీ చర్మం ప్రకాశవంతంగా మారడం మాత్రమే కాదు.. మొటిమల సమస్య కూడా ఎప్పటికీ మీ దరిచేరదు.


 
ఇందుకు ఒక క‌ప్పు నీటిలో ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర వేసి మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన నీరును బాగా ఆర‌నిచ్చి.. అనంతరం ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక పావు త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖం క్లీన్ చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా నివారిస్తుంది. వయస్సు కనబడనియ్యకుండా, ముకంలో ముడుతలు ఏర్పడకుండా చేస్తుంది. ఎందుకంటే.. ఇందుకు జీలకర్రలో విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండడమే కారణం. అలాగే జీల‌క‌ర్ర‌ను పౌడ‌ర్ చేసి.. అందులో కొద్దిగా తేనె మిక్స్ ముఖానికి అప్లై చేయాలి. ఆరిన త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేడ‌యం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌ల‌ను కూడా త‌గ్గించి.. ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. కాబ‌ట్టి, ఈ టిప్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేయండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: