వయసుతో సంబంధం లేకుండా అందంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ, ప్రస్తుత కాలంలో జీవనశైలిలోని మార్పుల వల్ల మొటిమలు, మచ్చలు, బ్లాక్, వైట్ హెడ్స్ టీనేజీ అమ్మాయినలు వేధించే అతి సాధారణ సమస్యలు. మనకు ఉన్నటువంటి చర్మ తత్వాన్ని బట్టి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఫలితంగా, ఈ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాయని భావించి, మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నిస్తారు.  మ‌రియు బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టు తిరిగి వేల‌కు వేలు ఖ‌ర్చు చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక బాధ‌ప‌డుతుంటారు.

 

అయితే  ఇంటి వద్దనే అందాన్ని అద్భుతంగా మెరిపించుకోవ‌చ్చు. మ‌రి ఇందుకోసం ఏం చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్‌, తేనె, యోగర్ట్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద  స్క్రబ్బర్‌లా రుద్దుకోవాలి. ఇలాచేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా, నిగారింపుతో కనిపిస్తుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి. అలాగే అవాంఛిత రోమాలు తొలగించేందుకు రేజర్‌ అనువైనది కాదు. ఇక ఇంట్లో వ్యాక్స్‌ లేకపోతే నిమ్మరసం, చక్కెర, నీళ్లు కలగలిపిన మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట ప్యాక్‌లా రాయాలి. 

 

కొద్దిసేపయ్యాక తొలగిస్తే ప్యాక్‌తో పాటు వెంట్రుకలు వచ్చేస్తాయి. అదేవిధంగా, కలబంద జెల్ మీ నైట్ క్రీమ్‌కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ జెల్ వాడటానికి, మీరు చేయాల్సిందల్లా ఒక ఆకు తెరిచి, జెల్ ను స్పూన్ తో తీసుకోవాలి. ఈ జెల్‌ను శుభ్రపరిచిన తర్వాత ముఖానికి రాయండి. దీని వ‌ల్ల మీ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. ఇక గోళ్లు అందంగా మెరవాలంటే... గోళ్ల చివర్లో ఉన్న మృతకణాలను తొలగించి, బాదం నూనె లేదా కొబ్బరి నూనె అప్లై చేస్తే మంచి ఫ‌లితం ఉటుంది. మ‌రియు బ్లాక్‌ టీని కురులకు పట్టించి.. అర గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ జుట్టు పట్టులా మెరుస్తూ కనిపిస్తుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: