అర‌టి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అరటిలో ఫైబర్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్ పోషకాలతోపాటూ, విటమిన్ సీ, ఇతర ఖనిజాలుంటాయి.  తిన్నవెంటనే ఎనర్జీ రావాలంటే, అందుకు అరటిపండ్లే బెస్ట్ ఆప్షన్. రక్తపోటును తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం,  రోగనిరోధకత పెంచడం లో అర‌టిపండు ఎంతో చ‌క్క‌గా సహాయపడుతుంది. అయితే అర‌టి పండు కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.. జుట్టు సంర‌క్ష‌ణ‌లోనూ గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అర‌టి పండును జుట్టుకు ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

IHG

అరటి పండ్లును ముక్కలుగా చేసుకుని బాగా పేస్టులా కలపండి. అందులో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు వేసి బాగా కలపండి. తర్వాత జుట్టు కుదుళ్లలోకి ఈ మిశ్రమం వెళ్లేలా తలకు ప‌ట్టించాలి. అర‌ గంట‌ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత షాంపుతో తలను స్నానం చేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల  తలకు ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. మ‌రియు పొడిబారిన, దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. చుండ్రు కూడా త‌గ్గుతుంది.

IHG

అలాగే అరటి పండును ముక్కలుగా చేసి పేస్టులా చేసుకోండి. ఆ త‌ర్వాత అందులో పాలు వేసి మరింత మెత్తగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల వరకు వెళ్లేలా ప‌ట్టించాలి. అర గంట తర్వాత చల్లని నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి. అనంతరం షాంపుతో తల స్నానం చేయండి. జుట్టును ఎదుగుదలకు, బలోపేతం చేయడానికి, మాయిశ్చరైజ్ చేసేందుకు ఈ ప్యాక్ ఉపయోపడుతుంది. మ‌రియు ఈ ప్యాక్ పొడిబారిన, చింపురుగా ఉండే జుట్టును సరిచేయగ‌ల‌దు. సో.. ఖ‌చ్చితంగా ఈ రెండు హెయిన్ ఫ్యాక్స్ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: