ఇటీవ‌ల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన చ‌ర్మ స‌మ‌స్యల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. ముఖ్యంగా యవ్వనంలోకి వచ్చాక చాలామందిని మొటిమల సమస్య వేధిస్తుంటుంది. చర్మంలో ఉన్న నూనె గ్రంధుల నుండి అధిక చమురు స్రావం ఖచ్చితంగా మొటిమలకు ప్రధాన కారణం. పర్యావరణ కాలుష్యం, సూర్యుడికి బహిర్గతం, సౌందర్య సాధనాల వినియోగం, అధిక ఒత్తిడి, జంక్ ఆహారాలు మరియు నీటిని తక్కువగా తీసుకోవడం వ‌ల్ల కూడా మొటిమ‌లు రావ‌డానికి కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు.

 

అయితే ఈ మొటిమ‌ల‌కు జామ ఆకుల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. అవును: జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో... జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. ముఖ్యంగా జామ ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో విరివిగా వాడుతున్నారు. ప్రధానంగా తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి, పంటినొప్పితో తరచు బాధపడుతున్న వారికి ఉపయోగించే ఆయుర్వేద మందుల్లో జామ ఆకుల పాత్ర కీలకం. జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు చాలాసేపటి వరకు ఆకలి వేయదు. మ‌రియు బ‌రువు కూడా త‌గ్గుతారు. అయితే కొన్ని జామ ఆకుల్ని తీసుకుని బాగా నలిపి వాటిని మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశాల్లో లేక మొత్తం ముఖానికి పూసుకోవాలి. 

 

అర‌గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు చేయడం వ‌ల్ల జామ ఆకుల్లో ఉండే యాంటీ-బాక్టీరియా తత్వం మొటిమలను కలుగజేసే కణాలను తొలగిస్తుంది. ఇవి చర్మం పై ఉండే నల్లని మచ్చలు, మరకలను తొలగిస్తాయి. అలాగే కొన్ని జామ ఆకులను తీసుకుని వాటిని నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత వీటికిి పసుపుని కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి మునివేళ్ళతో మృదువుగా మర్దన చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల బ్లాక్ హెడ్స్ త‌గ్గ‌డంతో పాటు ముఖం కాంతివంగా మెరుస్తుంది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: